Switch to English

టీవీ 9 సిఈఓ రవిప్రకాష్‌ కథ ముగిసిందిలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

తెలుగు న్యూస్‌ ఛానెళ్ల రంగంలోకి కొన్నేళ్ల క్రితం టీవీ 9 ఓ సంచలనంలా దూసుకొచ్చింది. అప్పటికీ, ఇప్పటికీ టీవీ 9 పేరు ప్రఖ్యాతలు తగ్గలేదు. వివాదాలు మాత్రం పెరుగుతూ వచ్చాయి. దేశ వ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ పలు భాషలకు విస్తరించింది. టీవీ 9 అంటే రవిప్రకాష్‌, రవిప్రకాష్‌ అంటే టీవీ 9. కానీ, అది నిన్నటి మాట. ఇప్పుడు రూటు మారిపోయింది. టీవీ 9 సిఈఓ రవిప్రకాష్‌ ఇప్పుడు కేవలం ఓ వాటాదారు మాత్రమే. అంతకు మించి టీవీ 9లో ఆయన పెత్తనం ఇకపై చెల్లదు. బోర్డ్‌ మీటింగ్స్‌కి వాటాదారుగా హాజరవ్వచ్చని టీవీ 9 యాజమాన్యం పేర్కొంది. కానీ సిఈఓని తొలగించాక, ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఆ సంస్థ గడప తొక్కుతారాయన.

అసలేమైంది.? రవిప్రకాష్‌కి ఎందుకీ పరిస్థితి దాపురించింది.? ఎవరూ ఊహించని విధంగా రవిప్రకాష్‌ మీద ఎందుకు వేటు పడింది.? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అన్ని చర్చల్లోనూ ఒక్కటే సారాంశం. ఇది రవిప్రకాష్‌ స్వయంకృతాపరాధమే. తెలుగు మీడియా రంగంలో చాలా న్యూస్‌ ఛానెల్స్‌ ఉన్నాయి. వాటికి పేరొందిన అధిపతులూ ఉన్నారు. కానీ, రవిప్రకాష్‌లా ఎవ్వరూ పబ్లిసిటీని కోరుకోలేదు. అయితే, ఆ పబ్లిసిటీ కూడా కొంతవరకూ తప్పు కాకపోవచ్చు. రవిప్రకాష్‌ ఆ పబ్లిసిటీ విషయంలో కూడా హద్దులు దాటేశారు. మీడియా అంటే బ్లాక్‌మెయిలింగ్‌ అనే స్థాయికి రవిప్రకాష్‌ జర్నలిజం విలువల్ని దిగజార్చేశారనే బలమైన అభిప్రాయం అంతటా వినిపిస్తుంటుంది.

రవిప్రకాష్‌ బెదిరింపులకు సంబంధించి కొంతమంది బాధితులు తమ ఆవేదనను చాలా సందర్భాల్లో వెల్లగక్కారు. కానీ, అప్పట్లో అవన్నీ చెల్లిపోయాయి. ఎప్పుడయితే అలంద మీడియా సంస్థ టీవీ 9ని కొనుగోలు చేసిందో, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కొత్త యాజమాన్యాన్ని తన సహజ శైలిలో ఇబ్బందులు పెట్టాలని చూసిన రవిప్రకాష్‌కి తగిన శాస్తే జరిగింది. రవిప్రకాష్‌ని బయటికి పంపేశారు. ఆయన స్థానంలో కన్నడ టీవీ 9 హెడ్‌ మహేంద్ర మిశ్రాని తాత్కాలికంగా నియమించారు. సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది కొత్త యాజమాన్యం.

గురువారమే రవిప్రకాష్‌ తొలగింపుకు సంబంధించి ప్రచారం జరిగింది. ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, అదంతా దుష్ప్రచారమని, తనను ఎవరూ తొలిగించలేదనీ, టీవీ 9 లైవ్‌లో కనిపించి, సాటి మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేశారు రవిప్రకాష్‌. వార్తలు ఎలా రాయాలో పాఠాలు చెప్పే ప్రయత్నమూ చేశారు. కానీ ఆయా మీడియా సంస్థలు చెప్పిందే నిజమైంది. రవిప్రకాష్‌ లైవ్‌లో చెప్పిందంతా బూటకమని తేలిపోయింది.

టీవీ 9 అంటే ఓ బ్రాండ్‌. ఆ టీవీ 9కి రవిప్రకాషే బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆ రవిప్రకాష్‌కి టీవీ 9 ట్యాగ్‌ లేకపోతే పరిస్థితి ఏంటీ.? కొత్త కుంపటి పెట్టే సత్తా ఆయనకుందా.? వాటాదారుడిగా టీవీ 9లో కొనసాగుతారా.? జర్నలిస్టుగా ఆయన మళ్లీ కనిపించడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఇన్నేళ్లలో ఆయన మిత్రుల కంటే, శత్రువులనే ఎక్కువ సంపాదించుకున్నారని మీడియా రంగంలో చాలా మంది చెబుతుంటారు. రవిప్రకాష్‌ మాత్రమే ఆయనకు చెందిన టీమ్‌ కూడా ఇప్పుడు సమస్యల్లో పడిందని సమాచారమ్‌. వాట్‌ నెక్స్‌ట్‌ రవిప్రకాష్‌.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...