Switch to English

అరవింద్‌ ‘అతి’.. జనసేనతో పొత్తుపై బీజేపీ ఇస్తుందా క్లారిటీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ధర్మపురి అరవింద్‌.. బీజేపీ ఎంపీ.. అనూహ్యంగా ఎంపీగా గెలిచారు.. అదీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత మీద పోటీ చేసి గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అప్పటినుంచీ, బీజేపీలో అరవింద్‌ దూకుడు ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. అయితే, గ్రేటర్‌ ఎన్నికల సమయంలో అరవింద్‌ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

‘మేం ఎవరి దగ్గరకూ వెళ్ళి, పార్టీలో చేర్చుకోవట్లేదు.. ఎవరినీ మేం బతిమాలట్లేదు.. వాళ్ళే మా పార్టీలో వచ్చి చేరుతున్నారు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అరవింద్‌. అయితే, బీజేపీ నేతలు.. తెలంగాణలో బలపడే క్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతల చుట్టూ చక్కర్లు కొడుతోన్న విషయం విదితమే.

విజయశాంతి దగ్గరకు వెళ్ళిందీ బీజేపీ నేతలే.. విక్రమ్‌ గౌడ్‌ వద్దకు వెళ్ళింది కూడా బీజేపీ నేతలే. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో మద్దతు కోసం మిత్రపక్షం జనసేన దగ్గరకు వెళ్ళిందీ బీజేపీ నేతలే. కానీ, తెలంగాణలో బీజేపీకి ఎవరితోనూ పొత్తు లేదని అరవింద్‌ అంటున్నారు. ‘బీజేపీ, జనసేన పొత్తు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం..’ అంటూ అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో, జనసైనికులకు ఒళ్ళు మండిపోతోంది.

ఇప్పటికే జనసైనికులు, గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. నిజానికి, గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేన కూడా తమ అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకుంది. అయితే, బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభ్యర్థనతో, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. తమ అభ్యర్థుల్ని బరిలో నిలవకుండా చేసి, బీజేపీకి తమ పార్టీ తరఫున మద్దతిస్తామని ప్రకటించారు.

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌కి సమయం దగ్గరపడుతుండగా, ఈ సమయంలో బీజేపీ నేత అరవింద్‌, జనసేన పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా జనసైనికుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. అయితే, అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన సూచనకు కట్టుబడి, బీజేపీకి మద్దతివ్వక తప్పడంలేదు జనసైనికులకి. ‘జనసేన – బీజేపీ పొత్తు గురించి అరవింద్‌ మాట్లాడటం హాస్యాస్పదం. ఆ పొత్తు జాతీయ స్థాయి నేతలతో, జనసేన అధిష్టానానికి కుదిరింది. అరవింద్‌ వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..’ అని జనసేన నేతలు, జనసైనికులకు సూచిస్తోంటే, కొందరు బీజేపీ నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం, జనసేనను లైట్‌ తీసుకున్న విషయం విదితమే. ఏదిఏమైనా, జనసేన విషయంలో బీజేపీలో ఒక్కో నాయకుడిదీ ఒక్కో తీరు అన్నట్టుంది. ఈ విషయమై జనసేన అధినేత, బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం వుంది. అన్నిటికీ మించి, జనసేనతో బీజేపీ పొత్తు వల్ల జనసేనకే నష్టమన్న విషయం జనసేనాని గుర్తెరిగితే మంచిదేమో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...