Switch to English

డ్రగ్స్‌ అండ్‌ గ్లామర్‌: ఈ ‘లీకుల’ వెనుక అసలు కథేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ అనుమానాస్పద మరణం కేసు వెనక్కి వెళ్ళింది.. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు ముందుకొచ్చింది. డ్రగ్స్‌ కేసు విచారణలో కనిపిస్తున్న వేగం, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ మిస్టీరియస్‌ డెత్‌ కేసులో కనిపించకపోవడం వెనుక అసలు కారణమేంటి.? ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. తెరవెనుక ఏదో జరుగుతోంది.! ఇదంతా ‘డైవర్షన్‌ రాజకీయం’ అనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి.

దేశంలో ఇప్పటిదాకా డ్రగ్స్‌ వ్యవహారాలే వెలుగు చూడలేదా.? సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ కలకలం ఇదే మొదటిసారా.? డ్రగ్స్‌ కేసుల్లో ఎవరికైనా ఇప్పటిదాకా తీవ్రమైన శిక్షలు పడ్డాయా.? ఇకపై పడబోతున్నాయా.? ఇలా చాలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా నేషనల్‌ మీడియా, బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుని చాలా స్పెషల్‌గా డీల్‌ చేస్తోంది. దేశంలో అతి ముఖ్యమైన సమస్యలు ఎలా వున్నా మీడియాకి అనవసరం. ‘గ్లామరస్‌’గా గాసిప్స్‌ వండి వడ్డించేస్తే సరిపోతుందన్నట్టుగా తయారైంది పరిస్థితి.

దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటోంది. మరణాలూ పెద్దయెత్తున చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారిక లెక్కలు తీస్తే, గుండె గుభేల్‌మనడం ఖాయం. కరోనా కారణంగా దేశం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ‘మారటోరియం’ గడువు ముగియడంతో వినియోగదారులకు బ్యాంకుల నుంచి వేధింపులు పెరిగిపోయాయి.. ఈ క్రమంలో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు కూడా. దురదృష్టవశాత్తూ ఇవేవీ మీడియాకి కనిపించడంలేదు.

కరోనా వచ్చినా, రాకపోయినా.. ఆ పేరు చెప్పి ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లను దోచేస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ వ్యవహారాలపై దృష్టిపెట్టకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. నో డౌట్‌.. డ్రగ్స్‌ అంటే ఆషామాషీగా కొట్టిపారేయాల్సిన వ్యవహారం కాదు. కానీ, అంతకన్నా పెద్ద సమస్య కరోనా. ఫలానా నటికి నోటీసులు, ఫలానా నటి అరెస్ట్‌.. అంటూ నేషనల్‌ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక అసలు కోణం వేరే వుందనీ, ఇదంతా డైవర్షన్‌ రాజకీయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో గతంలో వెలుగు చూసిన డ్రగ్స్‌ వ్యవహారం ఎలా డైల్యూట్‌ అయిపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు కూడా అలాగే కనిపిస్తోంది. మీడియా ‘సమాజ హితం’ గురించి ఆలోచించడం ఎప్పుడో మానేసింది. ప్రభుత్వాలకు ‘తొత్తు’గా మారిపోయిన మీడియా.. కళ్ళు తెరుస్తుందని వాస్తవాలు చూస్తుందని, చూపిస్తుందని ఎలా ఆశించగలం.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....