Switch to English

‘టిటిడి డిక్లరేషన్‌’.. జగన్‌ ఎపిసోడ్‌లో చంద్రబాబు సెల్ఫ్ గోల్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.. అదీ డిక్లరేషన్‌పై సంతకం చేయకుండానే. అప్పట్లో టీడీపీ కొంత యాగీ చేసినా, ఆ తర్వాత సైలెంటయిపోయింది. కానీ, ఈసారి మరింత ఎక్కువ రాద్ధాంతం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ వైఎస్‌ జగన్‌కి వ్యతిరేకంగా నినదించాలంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, ఇలా ‘సెల్ఫ్ గోల్‌’ ప్రక్రియకు ఎందుకు తెరలేపారన్నది చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ పార్టీ అన్నాక రాజకీయాలు చేయడం మామూలే అయినా, మరీ ఈ స్థాయిలో దిగజారుడు రాజకీయం చేయడమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇదేదో చంద్రబాబు టీడీపీ మేలు కోసం కాదు, బీజేపీ మెప్పు కోసం చేస్తున్నట్లుగా వుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీటీడీకి సంబంధించి అన్యమతస్తుల డిక్లరేషన్‌పై నిబంధనలున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ నిబంధనల్ని పాటించాల్సిన నైతిక బాధ్యత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద వుంది. అయితే, ఈ విషయమై జరుగుతున్న రాద్ధాంతాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మరింతగా వివాదాన్ని రాజేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్‌ అడ్వాంటేజ్‌ ఇటు వైసీపీకి, అటు బీజేపీకి లభిస్తోంది తప్ప.. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేదు.

రాజకీయంగా ప్రయోజనం లేని ఓ అంశాన్ని పట్టుకుని చంద్రబాబు ఎందుకు ఇంత హంగామా చేస్తోందన్నది టీడీపీలోనే చాలామందికి వస్తోన్న ప్రశ్న. ‘మీరు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఏం పీకారు.?’ అంటూ మంత్రి కొడాలి నాని బాహాటంగానే చంద్రబాబుని ప్రశ్నిస్తోంటే, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి తెలుగు తమ్ముళ్ళది. ఏదిఏమైనా, ‘ఓ వర్గం’ మెప్పు కోసం వైసీపీ, రాష్ట్రంలో మతపరమైన వివాదాల్ని మరింత పెంచి పోషిస్తోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో మంత్రులు సైతం తమవంతు పాత్ర పోషిస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...