Switch to English

3 క్యాపిటల్స్‌కి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఎపిసోడ్‌ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై రాజపత్రం విడుదలైనా, హైకోర్టు ‘స్టేటస్‌ కో’ ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఇంకోపక్క, కుప్పలు తెప్పలుగా పిటిషన్లు దాఖలవుతున్నాయి ఈ అంశానికి సంబంధించి న్యాయస్థానాల్లో. ప్రభుత్వం సైతం, తన వాదనను గట్టిగా విన్పిస్తూ న్యాయ స్థానాల్ని ఆశ్రయిస్తోన్న విషయం విదితమే.

ఇదిలా వుంటే, మూడు రాజధానుల అంశానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని అంటున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం నోటిఫై చేయడంతో, దాన్ని కేంద్రం సైతం నోటిఫై చేయాల్సి వచ్చింది. విభజన చట్టం ప్రకారం, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం కొన్ని నిధులు కూడా విడుదల చేసింది. పలుమార్లు పార్లమెంటులో ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులే స్పష్టం చేశారు. మరి, ఇప్పుడు మూడు రాజధానులంటూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ‘సోలో’ డెసిషన్‌ తీసుకుంటే ఎలా.? అన్నది రఘురామకృష్ణరాజు సంధిస్తోన్న ప్రశ్న.

ఓ పక్క కేంద్రం, ‘రాష్ట్ర రాజధాని విషయంలో మా ప్రమేయం వుండదు’ అని తేల్చి చెప్పేస్తోంటే, ‘పార్లమెంటు ఆమోదం పొందాల్సిందే..’ అని రఘురామకృష్ణరాజు ఎలా చెబుతున్నారు.? ‘నాకున్న పరిధిలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాను.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్దయెత్తున ఫీజులు చెల్లించి లాయర్లను పెట్టుకోగలదుగానీ.. నేను ఆ పని చేయలేను. నాకున్న పరిచయాల నేపథ్యంలో, నా సన్నిహితులు, స్నేహితులైన న్యాయ పండితుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాను. ఆ సమాచారం ప్రకారం మూడు రాజధానుల అంశానికి పార్లమెంటు ఆమోదం వుండాల్సిందే..’ అని రఘురామ తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల్లో ఒకటైన న్యాయ రాజధాని విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. ఎందుకంటే, హైకోర్టు ఎక్కడ వుండాలన్నది గతంలోనే డిసైడ్‌ అయిపోయింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం కానే కాదు. కేంద్ర న్యాయ శాఖ, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి.. ఇలా ఇన్ని వ్యవహారాలు దాంతో ముడిపడి వున్నాయి. శాసన మండలిని రద్దు చేయాలంటూ, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపితే, కేంద్రం ఇప్పటిదాకా ఎటూ తేల్చలేదు. ఆ లెక్కన, న్యాయ రాజధాని అసలు సాధ్యమయ్యేలానే కన్పించడంలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...