Switch to English

జబర్‌దస్త్‌ కామెడీ: విశాఖపై పవన్‌కి కోపమేంటి రోజమ్మా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, సినిమాకి సంబంధించి ఓనమాలు నేర్చుకున్నది విశాఖపట్నంలోనే. విశాఖ మీద ఆయనకున్న మమకారం అంతా ఇంతా కాదు. ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టేలా ఆయన సినిమాల్లో ఆ ప్రాంతానికి చెందిన జానపదాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించేవారాయన. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానుల చూట్టూ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత అందరికీ ‘ఈజీ టార్గెట్‌’ అవుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శించడానికి ‘అవినీతి అనో.. ఇంకోటనో’ ఛాన్సుండదు గనుక, ఏదో ఒక అర్థం పర్థం లేని అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సి వుంటుంది రాజకీయ ప్రత్యర్థులకి. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అదే పని చేశారు. విశాఖ మీద పవన్‌కి అక్కసు ఎందుకు.? విశాఖని ఎందుకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కాకుండా వ్యతిరేకిస్తున్నారు.. అని జనసేనపై ‘జబర్‌దస్త్‌’గా గుస్సా అయిపోయారు రోజా.

‘అమరావతి రైతులకు న్యాయం చెయ్యండి..’ అని పవన్‌ కళ్యాణ్‌ నినదిస్తే అది విశాఖ మీద ‘కోపం’గా కన్పిస్తోంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకి. విశాఖ మీద అంత ప్రేమ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వుంటే, అమరావతిలో కాకుండా విశాఖలో ఇల్లు కట్టుకుని వుండాల్సింది కదా.! ‘అమరావతిలోనే రాజధాని వుంటుంది.. అందుకే అమరావతిలోనే వైఎస్‌ జగన్‌ ఇల్లు కట్టుకున్నారు..’ అని గతంలో ఇదే రోజమ్మ సెలవిచ్చారు. అంటే, అప్పట్లో బహుశా వైఎస్‌ జగన్‌కి విశాఖ అంటే ‘కోపం’ అయి వుండాలి.! రోజా మాటల్ని అలాగే అర్థం చేసుకోవాల్సి వుంటుంది మరి.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎక్కడ.? అన్న చర్చ వచ్చినప్పుడు విశాఖ పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ, విశాఖ పేరుని కూడా అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రస్తావించలేదు. ఆ లెక్కన, విశాఖ అంటే వైఎస్‌ జగన్‌కి, వైఎస్సార్సీపీకీ మొదటినుంచీ చిన్నచూపు వుందనే కదా అర్థం.? అవన్నీ ఎందుకు.? గడచిన ఏడాది కాలంలో విశాఖకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏం చేసింది.? ఈ ప్రశ్నకు సమాధానం వైసీపీ నేతలు చెప్పగలిగితే.. ఆ తర్వాతే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని ఈ విషయంలో ప్రశ్నించాలి. రాజధాని కోసం అమరావతి రైతులు భూములిచ్చారు.. ఈ క్రమంలో రైతులతో అప్పటి ప్రభుత్వ ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల్ని ప్రస్తుత ప్రభుత్వం గౌరవించాలి. ఈ మాత్రం లాజిక్‌ తెలియనోళ్ళంతా రాజకీయాల్లో జబర్‌దస్త్‌ కామెడీలు చేస్తే ఎలా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...