Switch to English

ఇదేంది ఇళయరాజా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఇటీవల తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆయన.. వివాదాస్పద అంశాల్లో వార్తల్లోకి ఎక్కుతున్నారు. కొంతకాలం క్రితం తన ఆప్తుడు అయిన నేపధ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంపై రాయల్టీ విషయంలో తగాదా పడ్డారు. తన అనుమతి లేకుండా తన పాటలు పాడొద్దంటూ ఆయనకు నోటీసు కూడా పంపించారు. దీనిపై అప్పట్లోనే ఇళయరాజాపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని, తన సంగీత పరికరాలు ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రసాద్ స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్ తో ఇళయరాజాకు మంచి అనుబంధం ఉండేది. మ్యూజిక్ మ్యాస్ట్రోపై గౌరవంతో ఎల్వీ ప్రసాద్.. చెన్నై స్టూడియోలో ఓ రికార్డింగ్ థియేటర్ ను వినియోగించుకోవాలని ఇచ్చారు. 1977 నుంచి ఇళయరాజా ఆ థియేటర్ ను ఉపయోగించుకుంటున్నారు. ఎల్వీ ప్రసాద్ తదనందరం కూడా ఇళయరాజాకు ఎలాంటి సమస్యా రాలేదు. అయితే, ఆయన మనవడు సాయి ప్రసాద్ తో ఇళయరాజాకు విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రికార్డింగ్ థియేటర్ ఖాళీ చేయాలని ఇళయరాజాకు సూచించారు. దీనిపై మ్యాజిక్ మ్యాస్ట్రో ఎదరు తిరిగారు. అది తనదేనని, ఎల్వీ ప్రసాద్ తనకు కానుకగా ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే, చట్టపరంగా ఇళయరాజాకు దానిపై ఎలాంటి హక్కులు లేవని చెబుతున్నారు. కేవలం ఆయనపై గౌరవంతో దానిని వినియోగించుకోవడానికి మాత్రమే ఇచ్చారన్నది సాయి ప్రసాద్ వెర్షన్. చట్టపరంగా హక్కులన్నీ ఎల్వీ ప్రసాద్ వారసులకే ఉన్నాయి. అయినప్పటికీ ఆ స్టూడియో తనదే అనే రీతిలో ఇళయరాజా కోర్టుకెక్కడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తనంతట తానుగా స్టూడియో ఖాళీ చేసి హుందాతనం చాటుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కానీ ఇళయరాజా అలా చేయకుండా తనపై సాయి ప్రసాద్ మనుషులు దాడి చేశారని, తన స్టూడియోలోని పరికరాలను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసు కోర్టులో కూడా నిలబడదని, అయినా ఇళయరాజా ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, ఆయన చెన్నైలోనే తన సొంత ప్రైవేటు స్టూడియోకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని, సెప్టెంబర్ లో దానిని ప్రారంభించే అవకాశం ఉందని కూడా వార్తలొచ్చాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....