కరోనా కారణంగా సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అంతా కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఏ వైపు నుండి కరోనా ముంచుకు వస్తుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతోంది. కరోనా కారణంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయ్యారు. చిన్నా చితకా జాబులు చేసుకునే వారు ఇప్పుడు ఆ జాబ్స్‌ను కోల్పోయారు. కాని ప్రభాస్ వంటి మనసున్న మంచి మనుషులు మాత్రం జాబ్‌లు తీయకుండా జాబ్ చేయించుకోకుండా జీతాలు ఇస్తున్నారు.
ప్రభాస్ తన వ్యక్తిగత స్టాప్ తో పాటు ఇంటికి పని చేసేందుకు వచ్చిన మొత్తం 15 మంది స్టాప్‌ను ఇంటికే పరిమితం అవ్వాలని సూచించాడట. వారు ఇంట్లో ఉన్నా కూడా వారికి కావాల్సిన వసతులు సమకూర్చడంతో పాటు వారికి నెల నెల ఎప్పటి మాదిరిగానే జీతం ఇస్తున్నాడట. ఈమద్య కాలంలో కొందరు సెలబ్రెటీలు తమ వ్యక్తిగత స్టాప్‌ను తొలగించారు. దాంతో చాలా మంది నిరుద్యోగులు అయ్యారు.
ప్రభాస్ మాత్రం తన స్టాప్ మరియు తన సేఫ్టీ దృష్టిని పెట్టుకుని వారిని డ్యూటీకి రావద్దన్నాడు. వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మూడు నెలలుగా జీతాలు ఇస్తూనే ఉన్నాడు. ఇలాంటి ఓనర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రభాస్ లాంటి మంచి మనిషి వద్ద డ్యూటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రభాస్ స్టాప్ అంటున్నారు. ఈమద్య కాలంలో ఏ ఒక్కరు కూడా ప్రభాస్ ను కలవలేదట. అప్పుడప్పుడు వారి గురించి ప్రభాస్ స్వయంగా ఎంక్వౌరీ చేసి వారి బాగోగులు గురించి తెలుసుకుంటున్నాడట.
671544 630627Hi! I discovered your internet site accidentally today, but am truly pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 50790