Switch to English

‘రఘురామ’ డ్యామేజీని.. రాపాకతో పూడ్చుతున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

నర్సాపురం వైసీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ) ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో సొంత పార్టీ నేతల అత్యుత్సాహం.. పార్టీ కొంప ముంచిందన్నది నిర్వివాదాంశం. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జరిగిన నష్టమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ విషయంలో వైసీపీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం పార్టీకి.. పూడ్చలేనంత డ్యామేజీ జరిగింది. ఏకంగా, ఇప్పుడాయన ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ ఉనికినే ప్రశ్నించేస్తున్నారు.

ఈ సమయంలో మీడియా అటెన్షన్‌నీ, ప్రజల దృష్టినీ పక్కకు మరల్చేందుకు వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ని తెరపైకి తెచ్చింది. చాలాకాలంగా రాపాక వరప్రసాద్‌, జనసేనకు దూరంగా వున్నారు. అయితే, జనసేన పార్టీ ఇంతవరకు రాపాకను విమర్శించింది లేదు. ‘రాపాకను విమర్శించొద్దు..’ అని అటు పార్టీ శ్రేణులకీ, ఇటు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకీ సందేశాలు గతంలోనే వెళ్ళడంతో.. పెద్దగా రాపాక మీద విమర్శలు రాలేదు. కానీ, రాపాకని ముందుకు తెచ్చి, జనసేనపై ఆయనతో విమర్శలు చేయించడం ద్వారా పొలిటికల్‌ గలాటాకి వైసీపీ పెద్దలు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది.

‘పార్టీ నిర్మాణమే జరగలేదు.. పార్టీలో నాకు తగిన గౌరవం దక్కలేదు.. పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడే అవకాశమే ఇవ్వరు.. ఆ అవకాశం ఎవరికీ వుండదు..’ అంటూ రాపాక, మీడియా ముందుకొచ్చి, జనసేన మీద ఘాటైన విమర్శలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, రాపాకకి సోషల్‌ మీడియా వేదికగా గట్టిగానే రిటార్ట్‌లు ఇస్తుండడం గమనార్హం. ఇక, కాపు రిజర్వేషన్ల అంశాన్ని పవన్‌ ప్రస్తావిస్తున్న దరిమిలా, జనసేనను ఇరకాటంలో పడేసేందుకూ జనసేన ఎమ్మెల్యే రాపాకని వైసీపీ ‘ట్రంప్‌ కార్డ్‌’లా వాడుతోందన్న విమర్శలు లేకపోలేదు.

టీడీపీ మీద విమర్శలు చేయించడానికి ఎలాగూ టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్ళిన కొందరు నేతలు వుండనే వున్నారు. ఎంతలా ‘డైవర్షన్‌’ పాలిటిక్స్‌ వైసీపీ చేస్తున్నా, రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌లో పార్టీకి చాలా డ్యామేజీ జరిగిపోయిందన్నది నిర్వివాదాంశం. కాగా, రాపాకతో వైసీపీ, జనసేన మీద విమర్శలు చేస్తోంటే.. కాస్తో కూస్తో రాపాక పట్ల సానుభూతి పెరుగుతుందేమోగానీ.. అది వైఎస్సార్సీపీకి ఏమాత్రం అడ్వాంటేజ్‌ అయ్యే పరిస్థితే లేదు. పైగా, జనసేనకు అది అదనపు అడ్వాంటేజ్‌గా మారే అవకాశాలున్నాయి.

5 COMMENTS

  1. 855236 577174For anybody who is considering about external complications, sometimes be tough amaze those to realize to produce just a single weed in this really flowing generally requires eleven liters concerning gasoline to. dc free mommy weblog giveaways family trip home gardening home power wash baby laundry detergent 76869

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...