Switch to English

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తూనే పలు సడలింపులు ఇస్తూ వచ్చారు. ఫలితంగా ఐదో లాక్ డౌన్ ప్రవేశించే సమయానికి దాదాపుగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగిపోతున్నాయి. ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, రాజకీయ సభలు, సమావేశాలు మినహా అన్నంటికీ అనుమతి ఇచ్చేశారు. ఈనెల 8 నుంచి అన్ లాక్-1లో భాగంగా ప్రార్థనా మందిరాలు తెరుచుకోవడానికీ వెసులుబాటు కల్పించారు.

కొన్ని రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాలు అంతర్రాష్ట్ర రాకపోకలకూ ఓకే చెప్పేశాయి. విమానాలు, రైళ్ల రాకపోకలూ షురూ అయ్యాయి. ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి. దీంతో అటు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజురోజుకూ దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పైపైకి వెళ్తున్నాయి.

గత 24 గంటల వ్యవధిలో దేశంలో ఏకంగా 8,392 కేసులు నమోదయ్యాయి. 230 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 1,90,535కి చేరింది. ఇదే ఒరవడి కొనసాగితే మరో రోజులోనే భారత్ లో కేసులు 2 లక్షలకు చేరుకుంటాయి. ప్రస్తుతం కేసులపరంగా భారత్ ఏడో స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 199 కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఇక్కడ కేసులు నమోదు కాలేదు. ఏపీలోనూ కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 104 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో అన్ లాక్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కరోనా కేసులు పెరగడానికి సానుకూలంగా మారినట్టయింది.

ఇప్పటికే ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి అన్ లాక్ అమల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హెర్డ్ ఇమ్యూనిటీ పెంచడం కోసమే అన్ లాక్ చర్యలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తున్నప్పటికీ.. అది అంత వరకు వర్కవుట్ అవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడటం మినహా చేసేదేమీ లేదు. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండటం తప్ప..!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...