Switch to English

ఓటీటీకే నిర్మాతల ఓటు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

కరోనా కారణంగా సినీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత కూడా మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న పలు సినిమాల పరిస్థితి ఘోరంగా మారింది. వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినవారు బెంబేలెత్తుతున్నారు. పెద్ద నిర్మాతలైతే కాస్త తట్టుకోగలరు గానీ, చిన్న నిర్మాతలకు ప్రస్తుత పరిస్థితి తలకు మించిన భారమే.

ఈ నేపథ్యంలో ఇలాంటివారికి ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. సినిమాలు ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితి లేనందున నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి మంచి మొత్తాలనే ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చిన్న నిర్మాతలకు ఇది వరమే. అయితే, ఓటీటీల్లో విడుదల చేయడానికి హీరోలు అంత సుముఖంగా ఉండటంలేదు. సినిమా అంటే థియేటర్ లో మాత్రమే చూడాలన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది.

కానీ ప్రస్తుత కరోనా కల్లోలం నేపథ్యంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో పలువురు నిర్మాతలు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి బడా నిర్మాతలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ఒక్కటే దారి అని చెబుతున్నారు.

సినిమా విడుదల ఆలస్యమయ్యే కొద్దీ దానిపై జనాలకు ఆసక్తి తగ్గిపోతుందని, అందువల్ల నిర్మాతల ప్రయోజనం మేరకు నిర్ణయం తీసుకోవాలని దిల్ రాజు అభిప్రాయపడగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీకి అమ్ముకోవడం మినహా మరో దారి లేదని అల్లు అరవింద్ చెబుతున్నారు. ఆయన ఇటీవలే ఆహా అనే ఓటీటీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఆయన ఓటీటీ వైపు మొగ్గు చూపడానికి ఒక కారణం కావొచ్చు.

నిజానికి ఓటీటీకి సినిమాను అమ్ముకోవడం వల్ల నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చేస్తాయని చెప్పలేం. ఒక్కో సినిమాకు పెట్టుబడి కూడా పూర్తిగా రాకపోవచ్చు. కానీ జరగబోయే నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవడానికి మాత్రం ఓటీటీ ఉపయోగపడుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...