Switch to English

కరోనాపై ఫైట్‌: మొదటి స్థానంలో ఏపీ.. ఏది నిజం.?

శంషాబాద్‌ తరహా అంతర్జాతీయ విమానాశ్రయంలో లేదు.! హైద్రాబాద్‌ లాంటి అభివృద్ధి చెందిన నగరమూ లేదు. అయినాగానీ, తెలంగాణతో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడుతోంది.! కరోనా వైరస్‌కి సంబంధించి విదేశాలతో లింకులున్న కేసులకంటే, ఢిల్లీ మర్కజ్‌ నిజాముద్దీన్‌ లింకులున్న కేసులే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ.. అని గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక, ఆంధ్రప్రదేశ్‌ తరహాలో ఏ రాష్ట్రమూ పబ్లిసిటీ స్టంట్లు చేయడంలేదు కరోనా వైరస్‌కి సంబంధించి. దేశమంతా కేరళ రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకుంటోందంటే.. ఆ రాష్ట్రంలో అంత గొప్పగా కరోనా వైరస్‌ని నియంత్రణలోకి తీసుకురాగలిగారు మరి.! కర్నాటకలోనూ పరిస్థితి అదుపులోనే వుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగానే వున్నా.. ఇక్కడా పరిస్థితి అదుపులోనే వున్నట్లు కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. 800కి పైగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 50కి పైగా కేసులకు సంబంధించి ‘లింక్‌’ దొరకడంలేదని సాక్షాత్తూ సంబంధిత మంత్రిగారే చెబుతున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటం తాలూకు తీరు.

కానీ, ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం దక్కించుకుందంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న పబ్లిసిటీ యాగీ అంతా ఇంతా కాదు. మొన్నామధ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి కరోనా పరీక్ష నిర్వహించారట.. అందులో నెగెటివ్‌ వచ్చిందట. ‘ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆయన్ని కోవిడ్‌ ఆసుపత్రికి తరలించేయండి..’ అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అవును మరి, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే, వెంటనే అంబులెన్సుల్లో కోవిడ్‌ ఆసుపత్రికి తరలించాలని ముఖ్యమంత్రిగారే సెలవిచ్చారు (మాట తడబడ్డారు).

ఆ సంగతి పక్కన పెడితే, కరోనా వైరస్‌ తీవ్రతను అంచనా వేయడానికి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ వినియోగిస్తుండగా, వాటి పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి. కేంద్రం, వాటిని వాడొద్దని ఓ పక్క స్పష్టమైన ఆదేశాలు ఇస్తోంటే, వాటితో పరీక్షలు నిర్వహించేస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడేస్తున్నామని వైసీపీ నేతలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడాన్ని ఏమనుకోవాలి.? కరోనా వైరస్‌కి సంబంధించి పనికిమాలిన చెత్త పబ్లిసిటీ స్టంట్స్‌లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.. దేశవ్యాప్తంగా ఇంకే రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి లేదు మరి.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

మహేష్ హీరోయిన్ విషయంలో వెనక్కి తగ్గారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న 27వ చిత్ర వివరాలు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వెల్లడయ్యాయి. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే...

స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌: జనసేన డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆస్తులను ఇప్పటికే వేలం వేసేందుకు...

ఫ్లాష్ న్యూస్: లైవ్ ఇంటర్వ్యూలో భూకంపానికి బెదరని ప్రధాని.!

మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ...

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...