Switch to English

మే 7 వరకు లాక్‌డౌన్‌: లీడర్‌ అంటే కేసీఆర్‌లా వుండాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

‘కరోనా వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. ఆ వైరస్‌కి దూరంగా వుండాలి. అలా చేయాలంటే లాక్‌డౌన్‌ తప్ప ఇంకో మార్గం లేదు. ప్రస్తుతానికి కరోనా వైరస్‌కి మందు లేదు గనుక.. లాక్‌డౌన్‌ని కొనసాగించాల్సిందే.. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వాలకి ఏదీ ముఖ్యం కాకూడదు..’ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాస్సేపటి క్రితం చెప్పిన మాటల సారాంశమిది.

‘బతికుంటే బలుసాకు తినొచ్చు..’ అనే మాటని కరోనా వైరస్‌కి సంబంధించి ఏర్పాటు చేసిన తొలి ప్రెస్‌ మీట్‌లోనే కేసీఆర్‌ చెప్పారు. అదే మాటకి ఆయన ఇప్పటికీ కట్టుబడి వున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌కి సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం విదితమే. ‘హాట్‌ స్పాట్స్‌’ మినహా మిగతా ప్రాంతాలకు ఈ ‘సడలింపులు’ వర్తించనున్నాయి.

అయితే, ఆ సడలింపుల వ్యవహారాన్ని ‘భస్మాసురహస్తం’గా అభివర్ణిస్తున్నారు కొందరు నిపుణులు. ఒక్కసారి సడలింపు అంటూ జరిగితే, ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్యని ఆపడం ఎవరి తరమూ కాదన్నది నిపుణుల వాదన. ఆ నిపుణుల ఆలోచనలకు తగ్గట్టే కేసీఆర్‌ నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శిస్తున్నారు. నాయకుడిగా తన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరిస్తున్నారాయన.

2020-21 సంవత్సరానికిగాను స్కూల్‌ ఫీజుల్లో రూపాయి కూడా పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు కేసీఆర్‌. ఇంటి అద్దెల్ని వాయిదా వేసుకోవాల్సిందిగా హౌస్‌ ఓనర్స్‌కి సూచించారు. మే నెలకి కూడా ఉచితంగా రేషన్‌ అందించడంతోపాటుగా, 1,500 రూపాయలు తెల్ల రేషన్‌ కార్డ్‌ వున్నవారికి అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కరోనా సోకిన నేపథ్యంలో, తెలంగాణలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సిస్టమ్ ఇకపై పనిచేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించడం గమనార్హం.

కేసీఆర్‌ నోట వచ్చే ఒక్కో మాటా ‘తూటా’లా పేలుతోంది. ఆ మాటల్లో నిజాయితీ కన్పిస్తోంది. ప్రజల పట్ల ముఖ్యమంత్రికి వున్న బాధ్యత కన్పిస్తోంది. ఔను, లీడర్‌ అంటే కేసీఆర్‌లానే వుండాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సంక్షోభంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన సత్తా చాటుతున్నారు. ‘హెలికాప్టర్‌ మనీ కాకపోతే, ఎయిర్‌ క్రాఫ్ట్‌ మనీ అని పేరు పెట్టండి.. కానీ, ఈ పరిస్థితుల్లో ప్రజల్నీ, రాష్ట్రాల్నీ ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేయాల్సిందే..’ అని కేసీఆర్‌ కుండబద్దలుగొట్టేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...