Switch to English

శవ రాజకీయాలు కాదు.. వైరస్‌ రాజకీయాలివి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

నగిరి మునిసిపాలిటీ పరిధిలో అధికారులకు మాస్క్‌లు అందుబాటులో లేవంటూ కమిషనర్‌ స్ఠాయి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తే, పరిస్థితిని అర్థం చేసుకుని.. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సదరు అధికారిపై వేటు వేసింది. మాస్క్‌లు, బాడీ సూట్‌లు లేకపోవడంతో విధి నిర్వహణ కష్టతరమవుతోందన్నది సదరు అధికారి ఆరోపణ. ఆ అధికారిపై వేటు పడటం సంగతి పక్కన పెడితే, నగిరి ఎమ్మెల్యే రోజా మాత్రం, నిత్యం జనంలో వుంటున్నారు.

మాస్క్‌ల్ని జనాలకు పంచి పెడుతున్నారు.. వైరస్‌ని నివారించేందుకోసం డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌ ద్రావణాన్ని స్వయంగా తన చేతుల మీదుగా చల్లేస్తున్నారు. మంచిదే.. జనంలోకి నేతలు వెళ్ళడం అవసరమే. విపత్తుల వేళ ఇలాంటి చర్యలు ప్రజలకు భరోసానిస్తాయి కూడా. అయితే, అధికారుల్ని, సిబ్బందిని పనిచేయనీయకుండా ప్రజా ప్రతినిథులు పబ్లిసిటీ స్టంట్లు చేస్తేనే సమస్య ముదిరి పాకాన పడుతుంది. పైగా, కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రజా ప్రతినిథులకు ఏమవుతుందోనని అధికారులు హైరానా పడాల్సి వస్తోంది.

ఒక్క నగిరిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల అధికార పార్టీ నేతల అత్యుత్సాహం ఇలాగే కన్పిస్తోంది. ‘వీడియో సరిగ్గా వస్తోందా.?’, ‘ఫొటోకి పోజు సరిపోతుందా.?’ అంటూ ‘ప్రజా సేవ’ చేసేస్తున్నారు వైసీపీ నేతలు. మొన్నటికి మొన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌, కరోనా ఐసోలేషన్‌ వార్డ్‌కి ప్రారంభోత్సవం చేశారు. ఈ క్రమంలో రిబ్బన్‌ కటింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తే కత్తెర మొరాయించింది. అంతకు ముందు వరకూ మొహానికి మాస్క్‌ వేసుకున్న అవంతి శ్రీనివాస్‌, ఫొటో కోసం మాస్క్‌ని తీసేశారు.

‘సోషల్‌ డిస్టెన్స్‌’తోనే కరోనా వైరస్‌ని నియంత్రించగలమని ఓ పక్క ప్రభుత్వం చెబుతోంటే, అధికార పార్టీ నేతలు పబ్లిసిటీ కోసం జనాల్లోకి వెళుతూ, సోషల్‌ డిస్టెన్స్‌ని అటకెక్కించేస్తున్నారు. అనుచరులతో హంగామా చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ర్యాలీ పేరుతో పెద్దయెత్తున జనాన్ని రోడ్ల మీదకి తీసుకొచ్చారు సదరు వైసీపీ నేత. ఇప్పటిదాకా శవ రాజకీయాల గురించి విన్నాం.. ఇప్పుడు వైరస్‌ రాజకీయాలు చూస్తున్నాం.. అంతే తేడా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...