Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: విశ్వసనీయత కోల్పోతున్న ‘మీడియా’ సంస్థలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సమాజానికేమో నీతులు చెబుతారు.. సొంత ఉద్యోగుల వెతల్ని పట్టించుకోరు.! ఇదీ కొన్ని ప్రధాన మీడియా సంస్థల యాజమాన్యాల తీరు. పత్రిక లేదా ఛానెల్‌ని నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదిప్పుడు. ఆ విషయం అందరికీ తెల్సిందే. పత్రిక ప్రింటింగ్‌ ఖర్చుకీ, అమ్మకం ఖర్చుకీ పొంతనే వుండదనీ.. దాదాపుగా ప్రతి పత్రికా నష్టాల్లోనే నడుస్తోందనీ మీడియా సంస్థల యాజమాన్యాలు చెబుతుంటాయి.

మరి ప్రకటనల మాటేమిటి.? ప్రకటనలొక్కటేనా.! ఆయా రాజకీయ పార్టీల తరఫున అనుకూల కథనాలు వండి వడ్డించడం ద్వారా దక్కే ‘ప్రయోజనాల’ మాటేమిటి.? చాలామంది సీనియర్‌ జర్నలిస్టులు తెలుగు మీడియా రంగంలో చోటు చేసుకుంటున్న కొత్త పోకడలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మీడియా అంటే సామాజిక బాధ్యతతో కూడుకున్న వ్యవహారం ఒకప్పుడు. కానీ, ఇప్పుడు మీడియా అంటే కేవలం వ్యాపారం మాత్రమే..’ అని అసలు విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు సీనియర్‌ మోస్ట్‌ జర్నలిస్టులు కొందరు.

ఐదేళ్ళకీ, పదేళ్ళకీ ప్లానింగ్‌ ముందుగా సిద్ధం చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు, కరోనా వైరస్‌ బూచి చూపించి ‘కాస్ట్‌ కటింగ్‌’ పేరుతో జర్నలిస్టుల్ని రోడ్డున పడేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయా మీడియా సంస్థలు పూర్తిగా విశ్వసనీయతను కోల్పోతున్నాయి. ‘ఇకపై ఆ మీడియా సంస్థలు మనుగడ సాధించడం అసాధ్యం. కష్ట కాలంలో జర్నలిస్టుల్ని రోడ్డున పడేయడం అనైతికం..’ అని ఓ బాధిత సీనియర్‌ జర్నలిస్టు సోషల్‌ మీడియా వేదికగా వాపోతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

‘కొత్త తరం జర్నలిస్టులు తక్కువ ఖర్చుకే దొరకవచ్చుగాక.. ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా కథనాలు వండి వార్చడంలో వాళ్ళు సిద్ధహస్తులై వుండొచ్చుగాక.. కానీ, ఈ కొత్త విధానం జర్నలిజం విలువలకి వెన్నుపోటు పొడవడమే’ అంటున్నారు చాలామంది సీనియర్‌ జర్నలిస్టులు. ‘అందుకే జనం సోషల్‌ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారు.. ఇకపై రెగ్యులర్‌ మీడియాకి జనంలో అస్సలేమాత్రం విశ్వసనీయత వుండదు’ అంటోన్న కొందరు సీనియర్‌ జర్నలిస్టుల వాదనని ఎలా కొట్టి పారేయగలం.?

‘నిజాన్ని నిర్భయంగా చెప్పే అవకాశం రెగ్యులర్‌ మీడియాలో లేకపోవడంతోనేనేమో.. వెబ్‌ మీడియా కావొచ్చు.. ఇతర ప్లాట్‌ఫామ్స్ లో కావొచ్చు.. తాము చెప్పదలచుకున్నది చెబుతున్నారు..’ అన్నది మెజార్టీ జర్నలిస్టుల అభిప్రాయంగా కన్పిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...