Switch to English

‘మధ’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 3.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie మధ
Star Cast త్రిష్ణ ముఖర్జీ, వెంకట్ రాహుల్
Director శ్రీవిద్య బసవ
Producer ఇందిర బసవ
Music నరేష్ కుమరన్
Run Time 1 గంట 45 నిముషాలు
Release మార్చి 13, 2020

వరల్డ్ వైడ్ గా జరిగిన పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 7 బెస్ట్ టెక్నీషియన్స్ అవార్డ్స్, 8 బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్, 3 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్, 3 బెస్ట్ హీరోయిన్ అవార్డ్స్ అందుకున్న సినిమా ‘మధ’. యంగ్ అండ్ లేడీ డైరెక్టర్ శ్రీవిద్య బసవ దర్శకురాలిగా పరిచయమవుతూ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పలు అవార్డ్స్ ని గెలుచుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ – నిర్మాత మహేష్ కోనేరులని కూడా మెప్పించింది. దాంతో ఈ చిన్న సినిమాకి వెన్నుదన్నుగా నిలబడి నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్న ఈ ‘మధ’ థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతవరకూ థ్రిల్ చేసి మెప్పించిందో చూద్దాం..

కథ:

అనాధగా పెరిగిన నిషా(త్రిష్ణ ముఖర్జీ) అనుకోకుండా పబ్ లో కలిసిన అర్జున్(వెంకట్ రాహుల్)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమలో ఉండగా సినిమాటోగ్రాఫర్ గా ట్రై చేస్తున్న అర్జున్ కి ఓ సినిమా ఆఫర్ రావడంతో రెండు వారాలు నిషాకి దూరంగా వెళ్తాడు. అదే టైములో ఒంటరిగా ఉన్న నిషా పలు సందర్భాల వలన మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతుంది. తన ప్రవర్తనకి డిస్టర్బ్ అయినా చాలా మంది కంప్లైంట్ ఇవ్వడంతో నిషాని బలవంతంగా తీసుకెళ్ళి ఓ మెంటల్ హాస్పిటల్ లో వేస్తారు. ఇక అక్కడి నుంచి నిషా తప్పించుకుందా? లేక తను ప్రేమించిన అర్జున్ వచ్చి విడిపించాడా? అసలు నిషాని పిచ్చి దానిలా ప్రూవ్ చేసిన సందర్భాలేమిటి? నిషాని పిచ్చిదానిలా మార్చి మెంటల్ హాస్పిటల్ కి పంపడం వల్ల ఎవరికీ ఉపయోగం? అనే పలు ప్రశ్నలకి సమాధానమే ఈ ‘మధ’.

తెర మీద స్టార్స్..

మధ అనే కథ మొత్తం త్రిష్ణ ముఖర్జీ చుట్టూనే తిరుగుతుంది. డైరెక్టర్ శ్రీవిద్య రాసుకున్న పాత్రకి 100% న్యాయం చేసింది. ఎమోషనల్ మరియు మెంటల్ డిస్టర్బ్ సీన్స్ చాలా అంటే చాలా బాగా చేసింది. లుక్స్ పరంగా కూడా ఓకే. హీరోగా చేసిన వెంకట్ రాహుల్ చాలా మెచ్యూర్ పెర్ఫార్మన్స్ చేసాడు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ చూపడంలో మార్క్స్ కొట్టేసాడు. కథని మలుపుతిప్పే పాత్రలో అనీష్ కురువిళ్ళ బెస్ట్ అనిపించుకున్నాడు. రవి వర్మ పాత్రలో తను చూపిన వేరియేషన్స్ ని మెచ్చుకునే తీరాలి. బిక్రమ్ జీత్ కన్వర్పాల్, వినోద్ వర్మ, రవి వర్మ మరియు ఇతర ముఖ్య పాత్రల్లో మెరిసిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ సమయమే, అయినా వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా కెప్టెన్ అఫ్ ది షిప్ మరియు డెబ్యూ లేడీ డైరెక్టర్ అయిన శ్రీవిద్య బసవ గురించి మాట్లాడదాం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీవిద్య తనలో విషయం ఉందని ప్రూవ్ చేసుకుంది. అన్ని డిపార్ట్మెంట్స్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడమే కాకుండా, అందరినుంచీ ది బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకున్నారు. ఆ విషయంలో హాట్సాఫ్ చెప్పాలి. ఇక తను డీల్ చేసిన కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ విషయానికి వస్తే.. ఇలాంటి కథలని మనం ఇదివరకే చూసాం అది కూడా బిగ్ స్కేల్ లోనే చూసాం.. ఉదాహరణకి ఈ సినిమా అనుష్క ‘భాగమతి’ సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా సినిమా చూసేటప్పటికి కథ పరంగా అబ్బా ఏమన్నా కథ అని అనుకునేలా మాత్రం ఉండదు. కథ మరియు క్రైమ్ విషయంలో వేరే స్ట్రాంగ్ పాయింట్ ఎంచుకుని ఉంటే ఇంపాక్ట్ వేరేలా ఉండేది. కథ లో ఆ పాయింట్ అర్థం అవ్వడంతో స్క్రీన్ ప్లే పరంగా ఎక్కువ కసరత్తులు చేశారు. అందులో భాగంగా ఓపెనింగ్ సైకియార్టిస్ట్ లెక్చరింగ్ సీన్స్ మరియు ఫస్ట్ హాఫ్ లో వచ్చే అన్ని సబ్ ప్లాట్ ట్రాక్స్ ఆసక్తిగాఅనిపిస్తాయి. కథనం విషయంలో ఫస్ట్ హాఫ్ లో బాగా సక్సెస్ అయ్యారు కానీ అదే గ్రిప్పింగ్ ప్లే సెకండాఫ్ లో మిస్ అయిపొయింది. సెకండాఫ్ లో రాను రాను ఆ ఎక్సైట్ మెంట్ తగ్గిపోవడం, మెయిన్ క్రైమ్ రెగ్యులర్ గా అనిపించడం, ముఖ్యంగా క్లైమాక్స్ లో థ్రిల్స్ ని రివీల్ చేయడం అబ్బా అనేలా లేకపోవడం, కారణం(బడ్జెట్ లేకపోవడం) ఏదైనా క్లైమాక్స్ ని చుట్టేసినట్టు అనిపించడం లాంటివి సెకండాఫ్ కథనంలో మైనస్. ఫస్ట్ సినిమా అయినప్పటికీ డైరెక్టర్ శ్రీవిద్య బసవ విజువల్ టెల్లింగ్ కి అందరూ ఫిదా అవుతారు. థ్రిల్లర్ సినిమాల్లో చివరి వరకూ సీట్ ఎడ్జ్ లో కూర్చో బెట్టాలి కానీ 60% మాత్రమే అందులో సక్సెస్ అయ్యారు, అందులోనూ చివరికి వచ్చేసరికి ఊపిరి బిగపట్టుకునేలా ఉండాలి. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో కొంత ఫెయిల్ అయ్యారు. వచ్చిన అవార్డ్స్ పక్కనపెడితే, సినిమా పూర్తయ్యాక ఆడియన్స్ ఫుల్ హ్యాపీతో అయితే బయటకిరారు కాబట్టి కమర్షియల్ గా పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కానీ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసుకుంటే శ్రీవిద్య బసవ దగ్గర అటు విశ్లేషకులను మెప్పిస్తూనే ప్లస్ కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ కొట్టగలిగే సత్తా ఉందని మాత్రం చెప్పగలం.

అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ కథని ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. ముఖ్యంగా కథలోని పాత్రలు, ఎమోషన్స్ కి తగ్గట్టుగా తను చూపించిన కలర్ పాటర్న్ సూపర్బ్.. ఇలా హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ చూస్తుంటాం. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ కి ఆర్ట్ డైరెక్టర్ అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. వీరి తర్వాత చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్.. ప్రతి సీన్ ని తన మ్యూజిక్ తో హైలైట్ చేసి విజువల్ కి మరింత ఎక్సైట్ మెంట్ ని యాడ్ చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ సీన్ లో అంట కంటెంట్ లేకపోయినప్పటికీ ఎదో ఉన్నట్టు క్రియేట్ చేయడం కోసం లౌడ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాంటి చోట్ల మాత్రమే ఇక్కడ ఇంట వసరం లేదే అనిపిస్తుంది. రెంజిత్ టచ్రివర్ ఎడిటింగ్ కూడా బాగుంది. వీలయితే కొన్ని స్లో మోషన్ షాట్స్ కట్ చేసి ఉంటే కొన్ని కొన్ని చోట్ల సినిమా ఇంకాస్త స్పీడ్ గా ఉండేది. ఈ చిత్రానికి రచన మరియు డైలాగ్స్ అందించిన ప్రశాంత్ సాగర్ అట్లూరి విషయానికి వస్తే… మొదటి సీన్ లోనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే సీన్స్, ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ ని హోల్డ్ చేసే సీన్స్ ని చాలా బాగా రాశారు. కానీ మొదలు పెట్టిన సీన్స్ కి ఫినిషింగ్ అంతే ఇంపాక్ట్ లో లేదు. అలాగే థ్రిల్స్ రివీలింగ్ సీన్స్ చాలా బెటర్ గా రాయాల్సింది. ఓవరాల్ డైలాగ్స్ కథకి తగ్గట్టు బాగున్నాయి. సింక్ సినిమా మరియు అరవింద్ మీనన్ చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్ మాత్రం టాప్ లెవల్ అని చెప్పాలి. థియేటర్ లో ఆడియన్స్ ఫీలయ్యే చాలా ఎమోషన్స్ కి సగభాగం క్రెడిట్ వేళ్ళు కొట్టేశారు. చివరిగా చిన్న సినిమా అని చెప్పుకున్నప్పటికీ ఇందిర బసవ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఓ బిగ్ బడ్జెట్ సినిమా రేంజ్ లోనే ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సూపర్బ్ స్టార్ట్
– కిల్లర్ విజువల్స్
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మిక్సింగ్
– యాక్టర్స్ పెర్ఫార్మన్స్
– ప్రొడక్షన్ వాల్యూస్

బోరింగ్ మోమెంట్స్:

– సెకండాఫ్ లో గ్రిప్పింగ్ తగ్గడం
– ఎఫెక్టివ్ గా లేని క్లైమాక్స్
– చూసేసినట్టు అనిపించే ట్విస్ట్స్ అండ్ థ్రిల్స్
– రెగ్యులర్ కథ
– సాగదీసినట్టు ఉండే

విశ్లేషణ:

ఇప్పటికే పలు అవార్డ్స్ గెలుచుకొని, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, యంగ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు లాంటి వాళ్ళకి నచ్చడంతో ఈ వారం వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజైన ‘మధ’ సినిమా టెక్నికల్ గా ఫెంటాస్టిక్ ఫిల్మ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా హిట్/ప్లాప్ తో సంబధం లేకుండా డైరెక్టర్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కి మంచి పేరు, నెక్స్ట్ సినిమా ఆఫర్స్ కూడా వస్తాయి. అక్కడి వరకూ గ్యారంటీ.. కానీ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల పరంగా చూసుకుంటే మాత్రం వారిని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయిందనే చెప్పాలి. టెక్నికల్ గా ఎప్పటికప్పుడూ సూపర్బ్ అనుకుంటూనే ఉంటాం కానీ ఓవరాల్ సినిమా అయ్యాక బయటకి వచ్చేప్పుడు మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండాఫ్ మాత్రం ఆ హైప్ ని రీచ్ కాలేకపోయిందని అంటారు. ముఖ్యంగా కథలోని మెయిన్ క్రైమ్, క్లైమాక్స్ పాయింట్స్ వీక్ అవ్వడం వలన ప్రేక్షకులకి ఆఫీలింగ్ వస్తుంది. మరీ మాస్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కదు కానీ మల్టీ ప్లెక్స్ ఆడియన్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మాత్రం సినిమా నచ్చుతుంది.

ఇంటర్వల్ మోమెంట్: ఇన్ని కన్ఫ్యూజన్స్ బాగున్నాయి కానీ సెకండాఫ్ లో లింక్స్ బాగుండాలి.

ఎండ్ మోమెంట్: చూసేసిన కథే, తెలిసిన ట్విస్టులే, కనీసం క్లైమాక్స్ ఓపెనింగ్ లా సూపర్బ్ అనిపించి ఉంటే బాగుండేది.

చూడాలా? వద్దా?: హై టెక్నికల్ ఫిల్మ్ మరియు కాస్త బోర్ కొట్టినా రియలిస్టిక్ థ్రిల్లర్ చూడాలనుకునే వారు హ్యాపీగా చూడచ్చు.

బాక్స్ ఆఫీస్ రేంజ్:

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు యంగ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు లాంటి వారు ఈ సినిమాకి సపోర్ట్ చేయడం వలన మంచి రిలీజ్ దొరికింది అలాగే మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. కానీ సింగిల్ స్క్రీన్స్ లో జనాలు ఎక్కువ చూస్తే ఆ సినిమాకి లాభాలు కానీ ఈ సినిమాకి ఆ ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి ఫిల్మ్ ఫెస్టివల్స్ లానే తెలుగులో కూడా అవార్డ్స్ రావచ్చు కానీ యావరేజ్ టాక్ తో ఓ సైకాలజికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘మధ’ థియేటర్ రిలీజ్ ద్వారా లాభాలు అందుకోవడం కొంత కష్టమనే చెప్పాలి.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...