ఒక బ్లాక్ బస్టర్ హిట్, కల్ట్ క్లాసిక్ అందించాక ప్రతి ఫిల్మ్ మేకర్ కు వచ్చే ఇబ్బందే సుకుమార్ కు కూడా ఇప్పుడు వచ్చింది. రంగస్థలం సినిమాతో ఎవరూ ఊహించలేని హిట్ సాధించిన సుకుమార్ ఇప్పుడు తన తర్వాతి సినిమాకు కూడా అదే హ్యాంగోవర్ లో ఉన్నాడా అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సుకుమార్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు రంగస్థలం సినిమాకూ పోలికలు కనిపిస్తుండడమే దీనికి కారణం.
పుష్పలో కూడా అల్లు అర్జున్ రగ్డ్ అండ్ రఫ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. విడుదల చేసిన రెండు పోస్టర్స్ లో కూడా అల్లు అర్జున్ మేకోవర్ ఓకే కానీ అందులో రంగస్థలం ఛాయలు కనిపిస్తుండడమే ప్రధాన ఇబ్బందిగా మారింది. ఇక అసలు విషయంలోకి వెళితే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఈ కథ అనుకున్నప్పుడు మహేష్ లుక్ ను వేరేలా డిసైడ్ చేసాడట సుక్కూ. అయితే వన్స్ అల్లు అర్జున్ సీన్లోకి వచ్చాక తనకు రంగస్థలం స్టైల్ మేకోవర్ కావాలని అడిగాడట బన్నీ.
అందుకోసమే మళ్ళీ లుక్ ను కొత్తగా డిసైడ్ చేయించి అల్లు అర్జున్ కు చూపించి ఓకే అనుకున్నాకే ఫస్ట్ లుక్ ను వదిలారు. సాధారణంగా దర్శకులు కల్ట్ క్లాసిక్ తర్వాత పూర్తిగా డిఫెరెంట్ జోనర్ లో సినిమా చేయాలనుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం బన్నీ వల్ల సుకుమార్ మరోసారి అలాంటి సినిమానే చేయాల్సి వస్తోంది. మరి అది తనకు మంచే చేస్తుందా లేదా అన్నది చూడాలి.
511148 42113fantastic submit, very informative. 786816
125383 615843I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 439261
507168 53226I discovered your weblog site internet internet site on the internet and appearance some of your early posts. Continue to keep inside the wonderful operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far a lot more from you locating out at a later date! 832430
780155 271473Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to more added agreeable from you! Even so, how could we communicate? 683586