సాధారణంగా ఏదైనా సినిమా థియేట్రికల్ రన్ లో ఉన్నంత వరకే నిర్మాతలు పబ్లిసిటీ మీద ఖర్చుపెడుతుంటారు. డిజిటల్ రిలీజ్ అయ్యాక దానిపై డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే సినిమాకు ఇంత మొత్తమని ఆ స్ట్రీమింగ్ సంస్థలు సినిమాను కొనేసుకుంటాయి. ఆ సైట్ లో సినిమాకు ఎలాంటి స్పందన వచ్చినా కూడా నిర్మాతలకు అందాల్సిన డబ్బులు అందేస్తాయి. కాబట్టి ఇక ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదు.
అయితే ఇప్పుడు లాక్ డౌన్ లో ఉన్న పరిస్థితిలో డిజిటల్ ప్లాట్ ఫామ్ సామాన్యులకు ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా, భాషాబేధం లేకుండా ఇక్కడ సినిమాలు ఆడేస్తున్నాయి. రీసెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో తెలుగు సినిమాలు మధ, రాజావారు రాణీవారు, పలాస వంటి సినిమా డిజిటల్ సైట్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి.
అయితే వీటికి డిజిటల్ రిలీజ్ లోనూ పబ్లిసిటీ లభిస్తోంది. మా సినిమాలు డిజిటల్ రిలీజ్ లో కుమ్మేస్తోంది అంటూ నిర్మాతలు ప్రెస్ నోట్స్ విడుదల చేసారు. ఇదంతా ఎందుకయ్యా అంటే చిన్న సినిమాలకు ఇంత అమౌంట్ అని ఇచ్చి డిజిటల్ సంస్థలు కొనుక్కొవట్లేదు. రెవిన్యూ షేరింగ్ బేసిస్ లో సినిమాను కొనుగోలు చేసే ఒప్పందాలు చేసుకున్నాయి.
అంటే సినిమాకు వచ్చిన వ్యూస్ ను బట్టి డబ్బులు చెల్లిస్తారు. దానికి తగ్గట్లుగానే రెవిన్యూ ఉంటుందన్నమాట. అదీ సంగతి. అందుకే మా సినిమాకు ఆదరణ బాగుంది చూడండి అంటూ ఆ చిన్న సినిమాల నిర్మాతలు పబ్లిసిటీ చేసుకోవక తప్పట్లేదు.
917518 281967Cool text dude, keep up the good function, just shared this with the mates 78830
686870 678197Hello, you used to write magnificent, but the last few posts have been kinda boringK I miss your tremendous writings. Past several posts are just a little out of track! come on! 705932
750656 968221Hello! Ive been reading your web internet site for a while now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say keep up the great work! 987651
68131 582694replica watches are wonderful reproduction of original authentic swiss luxury time pieces. 782819