Switch to English

లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనదేశంలో విధించిన లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందా? పాజిటివ్ కేసుల నిరోధానికి ప్రకటించిన లాక్ డౌన్ ఫలితాలు ఆశించిన విధంగా ఉన్నాయా లేదా? ప్రస్తుతం ఈ అంశాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

భారత్ లో విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈనెల 14తో ముగియనుంది. దీనిని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం గతంలోనే స్పష్టంచేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపించడంలేదు. నిజానికి లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత భారత్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

గత నాలుగు రోజుల్లో సగటున రోజుకు 550 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సగటున రోజుకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 15న దేశంలో మూడు కేసులు ఉండగా.. ప్రస్తుతం అది 3,588కి చేరింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుత లాక్ డౌన్ ముగియడానికి ఇంకా తొమ్మిది రోజుల గడువు ఉంది. ఈ తొమ్మిది రోజులలో నమోదయ్యే కేసుల సంఖ్యను, వారి నుంచి ఇంకా ఎంతమందికి ఇది సోకే అవకాశం ఉంది అనే అంశాలను శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసిన తర్వాత లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వైరస్ సోకిన విషయం బయట పడాలంటే గరిష్టంగా 14 రోజులు పడుతుంది. ఆ లెక్కన ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాని రోజు నుంచి కచ్చితంగా 14 రోజుల లాక్ డౌన్ అవసరమవుతుంది. ఆ 14 రోజులు కూడా ఒక్క కేసూ నమోదు కాకుంటే వైరస్ అదుపులోకి వచ్చినట్టే భావించవచ్చు. అప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడానికి మార్గం సుగమం అవుతుంది.

ఒకవేళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే.. ప్రాంతాలను బట్టి కూడా లాక్ డౌన్ ఎత్తివేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా భౌతికదూరం, పరిశుభ్రత పాటించాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లో లాక్ డౌన్ కనీసం మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ప్రాంతాలవారీగా వివిధ దశల్లో లాక్ డౌన్ ఎత్తివేసే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. తొలుత వైరస్ ప్రభావం లేని పల్లెల్లో లాక్ డౌన్ తీసేస్తారని.. అనంతరం దశలవారీగా పట్టణాలు, నగరాల్లో దీనిని అమలు చేస్తారని చెబుతున్నారు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడక తప్పదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...