Switch to English

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, అధినేత మెప్పు కోసం సోషల్‌ మీడియాని అడ్డగోలుగా వాడేయడం చాన్నాళ్ళుగా చూస్తూనే వున్నాం. బాధ్యతగల ఎంపీగా, రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి కష్ట కాలంలో సానుకూల సందేశాలు ఇవ్వాల్సింది పోయి, రాజకీయ విమర్శలకే తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ని పరిమితం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ రోజు ఉదయం (ఏప్రిల్‌  ఉదయం 9 గంటల సమయానికి) 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యంత క్లిష్టతరమైన పరిస్థితి ఇది. కరోనా మహమ్మారిని రాష్ట్ర ప్రభుత్వం ఎంత లైట్‌ తీసుకుందో.. గతంలో జరిగిన చాలా సంఘటనలు నిరూపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయిందిగానీ.. అదే అధికార పార్టీ ఒత్తిళ్ళకు ఆయన తలొగ్గి వుంటే, ఈ కరోనా పాజిటివ కేసుల సంఖ్య 1490గా వుండేదేమో.

ఇప్పటికీ చంద్రబాబు పాలన గురించి విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా ఎడా పెడా విమర్శలు చేస్తూ, తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటున్నారు. చంద్రబాబు పాలనకి జనం ఎలాంటి తీర్పు ఇచ్చారో చూశాం. మరి, అదే తరహా తీర్పుని వైసీపీ కూడా కోరుకుంటోందా.? ఏడాదిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, హైద్రాబాద్‌ని తలదన్నే రాజధానిని నిర్మించగలిగిందా.? కనీసం హైద్రాబాద్‌ని తలదన్నే పెద్ద హాస్పిటల్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయగలిగిందా.? పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ చాలు, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు కరోనా వైరస్‌ని చంపేయొచ్చన్న ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ వుందిప్పుడు. ఆ ముఖ్యమంత్రే, ఇప్పుడు నానా హైరానా పడాల్సి వస్తోంది కరోనా వైరస్‌ విషయంలో.

ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కరోనా విషయంలో పూర్తి వైఫల్యం సుస్పష్టంగా కన్పిస్తోంది. చేతనైతే ముఖ్యమంత్రికి సరైన సలహాలివ్వాలి.. అంతేగానీ, సోషల్‌ మీడియాలో చచ్చు ట్వీట్లు వేసుకుంటూ పోతే జనం హర్షించరు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...