దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్ డౌన్ ఎత్తివేతపై ఆయనేమైనా స్పష్టత ఇస్తారా.? ప్రస్తుత లాక్ డౌన్కి సంబంధించి వెసులుబాట్లు కల్పిస్తారా.? లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన ఆయా రంగాలకు చేయూతనిచ్చే కార్యక్రమం ఏదైనా ప్రకటిస్తారా.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు దేశ ప్రజానీకం మదిలో మెదిలాయి. కానీ, వాటికి నరేంద్ర మోడీ వీడియో ప్రసంగంలో సమాధానాలు దొరకలేదు.
ఈ నెల 5వ తేదీన.. అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళల్లో విద్యుత్ దీపాల్ని ఆపేయాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీ. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆపేసి, ఆ 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలనీ, అవి లేకపోతే టార్చి లైట్లు.. మొబైల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లు వెలిగించాలనీ, కరోనాని తరిమేయడంలో దేశంలో ఒకరికొకరు సాయంగా వున్నామనే సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వాలనీ, ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలనీ నరేంద్ర మోడీ సూచించారు.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. దేశమంతా ఎప్పుడూ ఒకే తాటిపై వుంటూ వస్తోంది. అదే మన బలం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం.. ఇది మనకు గుర్వకారణం. దేశానికి సంబంధించిన ఏ ముఖ్య విషయంలో అయినా దేశమంతా ఒకే తాటిపైకి వస్తోంది. పదే పదే పరీక్షలు మనకి మనమే పెట్టుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో వుంది. కానీ, కేంద్రం ఏం చేస్తోంది.? పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.! అంటే, ఔనని చెప్పక తప్పదేమో. లోన్లపై మారటోరియాన్ని ఘనకార్యంగా చెప్పుకుంది కేంద్రం. ఆ మారటోరియంని వినియోగించుకుంటే జనం జేబులకు చిల్లులు పడతాయి. మరి, అలాంటప్పుడు మారటోరియంతో ఉపయోగమేంటి.? ఈ ప్రశ్నకు కేంద్రం వద్ద సమాధానం లేదు.
లాక్ డౌన్ ఎత్తివేత కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారో లేదో ఇంకా స్పష్టత రావడంలేదు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. జాతిని ఉద్దేశించి ప్రసంగించే క్రమంలో, సగటు భారతీయుడికి కనసీ ఊరట ఇచ్చే విషయం కూడా చెప్పని నరేంద్ర మోడీ, దేశ ప్రజల్ని పూర్తిగా నిరాశకు గురిచేశారన్నది నిర్వివాదాంశం.
A video messsage to my fellow Indians. https://t.co/rcS97tTFrH
— Narendra Modi (@narendramodi) April 3, 2020
335983 676443I enjoy looking by way of and I conceive this website got some truly beneficial stuff on it! . 468251
103844 155183Theres noticeably a bundle to uncover out about this. I assume you made certain great points in capabilities also. 343963