Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ‘హిట్’ మూవీ 3 పిల్లర్స్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ది బెస్ట్ లైఫ్ టైం మోమెంట్స్ – చైతన్య సాగిరాజు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమ.. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని ఎదురు చూసే వారు చాలా మందే ఉంటారు.. ఒక్కసారి ఆ అవకాశం వస్తే ఒక్క ఆరాత్రిలో స్టార్ అయిపోతావ్, ఆ ఫార్స్ తో బిజీ అయిపోతావ్.. అలానే ఒక్క రాంగ్ స్టెప్ తీసుకుంటే రాత్రికి రాత్రి జీరోకి వచ్చేస్తావ్, ఉన్న ఆఫర్స్ అన్ని క్లోజ్ అయిపోతావ్.. అందులోనూ ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వతహాగా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం.. దాదాపు 7 ఏళ్లుగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి, ప్రతి ఆడిషన్ అటెండ్ అయ్యి, నో అన్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నిస్తూ సక్సెస్ అందుకున్న యంగ్ యాక్టర్ చైతన్య సాగిరాజు. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’ మూవీలో కీ రోల్ చేసి ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ దృష్టిలో పడ్డ చైతన్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తనకి బర్త్ డే విషెస్ చెప్పి, తన సినీ ప్రయాణం గురించి, తన టార్గెట్ ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు..

షార్ట్ ఫిలిమ్స్ ప్రయాణం.. “సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి అనుకోలేదు. దానికి ప్రత్యామ్న్యాయంగానే షార్ట్ ఫిలిమ్స్ ఎంచుకున్నాను. నటుడిగా నన్ను నేను పరీక్షించుకోవడానికి, సినిమా అనేదానిపై అవగాహన రావడానికి, నాకు సినిమా అవకాశం రావడానికి కారణం షార్ట్ ఫిలిమ్సే”.

‘హిట్’ సినిమా అవకాశం ఎలా.??.. “చెప్పాలంటే అవకాశాలు రావట్లేదని 2019లో చాలా డిప్రెస్ అయ్యాను. సరే షార్ట్ ఫిలిమ్స్ చేసి కూడా చాల రోజులైందని కొత్తగా ఎమన్నా చేద్దామని ‘సదా నీ ప్రేమలో’ అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాను. అదే టైంలో శైలేష్ కొలను కొత్త ఆర్టిస్ట్ కావాలన్నారట. కానీ అందరూ దొరకడం చాలా కష్టం అన్నారట కానీ తాను యు ట్యూబ్ లో కూర్చొని సెర్చ్ చేసి నన్ను ఆడిషన్ కి రమ్మన్నాడు. నాకు ఆడిషన్స్ మీద పెద్ద నమ్మకం లేదు కానీ అడిగిన అన్ని చోట్లా ఇచ్చాను. అలానే ఇచ్చాను. నాకు తెలిసింది ఒక కానీ శైలేష్ గారు అడిగిన వేరియేషన్స్ అస్సలు టైం తీసుకోకుండా చేయడం వలన నేను పర్ఫెక్ట్ అని వెంటనే ఓకే చేశారు. నాని గారితో నాకు తానే కావాలని మాట్లాడి ఒప్పించాడు. ఇక మిగతా అంతా మిరాకిల్ లా జరిగిపోయింది”.

‘హిట్’ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్.. ” చాలానే ఉన్నాయి.. ముందుగా నాని గారు నన్ను ఎలాగూ పిలిచి ఎలా చేసానో చెప్పరు, సో సినిమా చూసాక ఎలా అయినా అయన దగ్గరికి వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలనుకున్నాను. కానీ ప్రివ్యూ చూసినప్పుడు ఆయనే అందరినీ మెచ్చుకుంటూ నా దగ్గర ఆగి చాలా బాగా చేసావ్ అనడం మర్చిపోలేనిది. అలాగే నెక్స్ట్ డే సక్సెస్ పార్టీలో టైం దొరకడంతో చాలా సేపు మాట్లాడి క్లైమాక్స్ లో చేసిన షేడ్స్ గురించి మాట్లాడి మెచ్చుకున్నారు. అలాగే ఒక యాక్టర్ ఇంకో యాక్టర్ ని అదీ కొత్త వారిని మెచ్చుకోవడం చాలా కష్టం. కానీ విశ్వక్ సేన్ సినిమా చూసాక అదరగొట్టావ్, చాలా మంచి పేరొస్తుందని చెప్పడం ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఇక ది బెస్ట్ అంటే మా డైరెక్టర్ శైలేష్ కొలను ఒకసారి.. నీ లాంటి టాలెంట్ ని ఇక్కడి వారు గుర్తించలేదు.. కానీ ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నేను గుర్తించా.. పక్కాగా చాలా సక్సెస్ అవుతావు అన్నారు. ఈ 3 కాంప్లిమెంట్స్ నా కెరీర్ బెస్ట్ మోమెంట్స్”.

‘హిట్’ ఇచ్చిన హిట్ వల్ల కెరీర్ పరంగా తీసుకున్న నిర్ణయం.. “మొదటి సినిమాతోనే అందరూ గుర్తు పెట్టె, మెచ్చుకునే పాత్ర చేయడం అదృష్టం. అందుకే ఇకపై చిన్న పాత్ర చేసినా ఇప్పుడు చేసిన దానికి తగ్గకుండా చూసుకోవాలని, నటుడిగా ప్రూవ్ చేసుకునే ఏ అవకాశాన్ని వదులుకోకూడని డిసైడ్ అయ్యాను”.

ఎందరో గొప్ప డైరెక్టర్స్, అందులో మీ మనసుకు నచ్చి ఈయన డైరెక్షన్ లో చేయాలనుకునే డైరెక్టర్.. “అలా అని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ పర్సనల్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన ఎప్పటికైనా రాజమౌళి గారి డైరెక్షన్ లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయాలనేది కోరిక. ఊహించని విధంగా వారిద్దరూ నా మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది”.

ఈ సినీ ప్రస్థానంలో మీ టార్గెట్.. “ఇలాంటి పాత్రలే చేయాలి అనే కండిషన్ పెట్టుకోలేదు. కానీ చైతన్య స్క్రీన్ మీద కనిపిస్తే అందరూ గుర్తు పట్టాలి, ఇతను చేసాడంటే ఈ పాత్ర చాలా బాగుంటుందని ఆడియన్స్ ఫీలవ్వాలి. ఉదాహరణకి ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, ధనుష్, విక్కీ కౌశల్ లాంటి వారు హీరోలుగా చేస్తూనే అలా నిలిచిపోయే కొన్ని పాత్రలు చేస్తుంటారు. అలాంటివి చేయాలి, వస్తాయని ఆశిస్తున్నాను”.

హీరోగా అవకాశం వస్తే ఎలాంటి సినిమాకి న్యాయం చేయగలరు.. ” నన్ను నేను అలా ప్రశ్నించుకున్నప్పుడు నాకు మొదటగా గుర్తొచ్చేసి ‘మజిలీ’ సినిమా. నాకు తెలిసి లవ్ స్టోరీస్ కి పూర్తి న్యాయం చేయగలను. అందులోనూ మజిలీలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో చేస్తే నటుడిగా ఇంకా బెటర్ అవ్వచ్చు, మంచి పేరూ తెచ్చుకోవచ్చు”.

మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన శైలేష్ కొలను గురించి.. “చాలా టాలెంటెడ్. అనుకున్నది ఇచ్చే వరకూ, వచ్చే వరకూ వదలడు. సినిమా కోసం వేరే కంఫర్టబుల్ లైఫ్ ని వదిలేసి వచ్చాడు. డైరెక్టర్ అవుదాం అనుకోలేదు, రైటర్ అనుకున్నారు. కానీ నాని గారు కథ విన్నాక నువ్వే డైరెక్ట్ చెయ్యి అంటే మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్లి 6 నెలలు డైరెక్షన్ గురించి నేర్చుకొని వచ్చి డైరెక్ట్ చేసాడు. సూపర్బ్ టాలెంటెడ్ పర్సన్”.

‘హిట్’ సినిమా తెచ్చిన అవకాశాలు.. ” బాగా తెలిసిన బ్యానర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. డిస్కషన్స్ కూడా జరిగాయి. ఈ కరోనా వల్ల అన్ని ఆగడంతో అవి అలా హోల్డ్ లో ఉన్నాయి. ఈ సమస్య తీరాక క్లారిటీ వస్తుంది. అలాగే ఆహా నుంచి వెబ్ సీరీస్ ఆఫర్ కూడా వచ్చింది. కానీ సైన్ చేసాక చెప్తాను”.

యాక్టర్ అవ్వాలనుకున్న ప్రయాణంలో నేర్చుకున్న పాయింట్.. ” సలహా ఇచ్చే స్థాయిలో లేను, కానీ షార్ట్ ఫిలిమ్స్ బ్యాక్ డ్రాప్ కావడం వలన చాలా మంది అడుగుతుంటారు యాక్టర్ అవ్వాలనుకుంటే షార్ట్ ఫిలిమ్స్ బెస్టా అని.. ఇక్కడ ఏదీ ఈజీగా రాదు. చాలా ఓపిక ఉండాలి, అధైర్య పడకూడదు, నిన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండాలి. ఇందులో ఏది లేకపోయినా నిలబడలేం, గెలవలేం. సలహా కాదు నా అనుభవం నాకు నేర్పిన సత్యం”.

ఈ కరోనాకి త్వరగా పరిష్కారం దొరికి, మీ తలుపు తట్టిన ప్రాజెక్ట్స్ అన్ని పట్టాలెక్కి టాలీవుడ్లో మీరు అనుకున్న స్థానాన్ని అందుకోవాలని కోరుకుంటూ.. ఇంటర్వ్యూని ముగించాం.

‘హిట్’ సక్సెస్ పార్టీలో నాని – విశ్వక్ సేన్ లతో చైతన్య వర్మ సాగిరాజు

‘హిట్’ మూవీ 3 పిల్లర్స్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ దిబెస్ట్ లైఫ్ టైం మోమెంట్స్ – చైతన్య సాగిరాజు

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....