వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న విఐ ఆనంద్ డైరెక్షన్ లో చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’. మాస్ మహారాజ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో, ఫుల్ ఎనర్జిటిక్ గా వింటేజ్ రవితేజ బ్యాక్ అనిపిస్తున్న ట్రైలర్స్ ప్రేక్షకులలో అంచనాలను పెంచేస్తున్నాయి.
జనవరి 24న రవితేజ బర్త్ డే(జనవరి 26) కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా, 35 కోట్లతో రూపొందించారని ఇదివరకే తెలిపాము. పలు ప్లాప్స్ కారణంగా ‘డిస్కో రాజా’ గత సినిమాల తరహాలోనే బిజినెస్ చేసింది. కానీ ఆంధ్ర – తెలంగాణలో అనుకున్న దానికన్నా తక్కువ బిజినెస్ అయ్యింది.
రవితేజ గత సినిమాలు ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ లు వరల్డ్ వైడ్ గా 22 కోట్ల బిజినెస్ చేశాయి. డిస్కో రాజా కూడా సేమ్ టు సేమ్ అదే రేంజ్ బిజినెస్ చేసింది.
రవితేజ ‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ బిజినెస్:
నైజాం – 6 కోట్లు
సీడెడ్ – 2.8 కోట్లు
గుంటూరు – 1.5 కోట్లు
ఉత్తరాంధ్ర – 2 కోట్లు
తూర్పు గోదావరి – 1.25 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.1 కోట్లు
కృష్ణా – 1.25 కోట్లు
నెల్లూరు – 0.65 కోట్లు
ఆంధ్ర – తెలంగాణ మొత్తం – 16.55 కోట్లు
కర్ణాటక – 1.2 కోట్లు
ఇండియా – 0.5 కోట్లు
ఓవర్సీస్ – 2 కోట్లు
మిగిలిన కంట్రీస్ – 2 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ – 22.25 కోట్లు
అక్షరాల 22 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఈ సరి నష్టాల నుంచి రికవర్ అవుతారు. 25 నుంచి 30 కోట్లు షేర్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాభాలను అందుకుంటారు. డిజాస్టర్స్ ఇచ్చి ఉన్న రవితేజకి ఈ టైంలో ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలి.
655693 819084If running proves to be a difficulty then it may be wise to find alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 422980
162798 560914I got what you intend, saved to bookmarks , extremely decent internet web site . 206998
939474 555210Thank you for your really good data and feedback from you. car dealers in san jose 283806
781002 159985Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 651201