Switch to English

టీఎస్సార్టీసీ కార్మికులు గెలిచారు.. కేసీఆర్‌ సంగతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పండగ వేళ సమ్మె చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులు ప్రయాణీకుల్ని ఇబ్బందుల్లోకి నెట్టిన మాట వాస్తవం. కానీ, నెల రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయాన్ని కార్మికులు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. దాంతో, ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతమయ్యింది. ప్రజలు కూడా తాము ప్రయాణాల పరంగా ఇబ్బందులు పడుతున్నా, కార్మికుల కష్టాల్ని అర్థం చేసుకున్నారు. ఇద్దరు కార్మికుల్ని ఈ సమ్మెలో పోగొట్టుకున్న తెలంగాణ ఆర్టీసీ.. ఎట్టకేలకు ఉపశమనం పొందింది.

‘సెల్ఫ్‌ డిస్మిస్‌..’ అంటూ కార్మికుల్ని వెటకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇప్పుడు అదే కార్మికులతో చర్చల కోసం దిగి రాక తప్పేలా లేదు. హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీకి ఎండీని ఏర్పాటు చేయడంతోపాటు కార్మికులతో చర్చల్ని ప్రారంభించాల్సి వుంది. ఏ సమస్యకి అయినా చర్చలతో పరిష్కారం లభిస్తుంది.

నిజానికి ఆర్టీసీ కార్మికులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమవుతున్న ఆర్టీసీ విలీనం, తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు.? పోనీ, సాధ్యా సాధ్యాల్ని పరిశీలిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పకపోవడం గమనార్హం. ప్రయాణీకుల కష్టాల్ని తగ్గించేందుకు తాత్కాలిక డ్రైవర్లను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుకి తెలియజేస్తే, అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కదా.? అని హైకోర్టు ప్రశ్నించింది.

ఎలా చూసినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె విషయంలో మొట్టికాయలు పడ్డ మాట వాస్తవం. నిజానికి, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో న్యాయం వుంది.. ప్రభుత్వం వాదనలో పస లేనే లేదు. అది అందరికీ అర్థమవుతున్నా, అధికారంలో వున్నవారికి మాత్రం అర్థం కావడంలేదు. ఆఖరికి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేశవరావు కూడా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కష్టాల్ని అర్థం చేసుకున్నారు.

దురదృష్టవశాత్తూ ఆయన గొంతునీ నొక్కేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు. మొత్తమ్మీద, మొట్టికాయలు పడ్డాక అయినా, కేసీఆర్‌ తన తీరు మార్చుకుంటారా.? మార్చుకోక తప్పదంతే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...