హీరో తరుణ్ కాదు, యంగ్ హీరో రాజ్ తరుణ్ నడుపుతోన్న కారు రోడ్డు ప్రమాదానికి కారణమయ్యిందన్న విషయమై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. హీరో తరుణ్ తరఫున, ఆ ఘటనతో తమకు సంబంధం లేదంటూ ఓ ప్రకటన విడుదల కాగా, రాజ్ తరుణ్ సన్నిహితులు సైతం, ఆ ఘటనతో ఆయను సంబంధం లేదని చెబుతుండడం గమనార్హం. అయితే, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కారు ప్రమాదానికి గురి కాగానే రాజ్ తరుణ్ కంగారుగా పారిపోతున్న విషయం తేటతెల్లమవుతోంది.
ఇంతకీ, రాజ్ తరుణ్ ఎందుకు అంత వేగంగా అక్కడి నుంచి పారిపోయినట్లు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ సమయంలో రాజ్ తరుణ్, అక్కడి నుంచి పారిపోతుండడాన్ని గుర్తించిన కొందరు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారమిచ్చారట. మరోపక్క, కారు ప్రమాదానికి గురైన సమయంలో మరికొందరు వున్నారన్నది ప్రత్యక్ష సాక్షుల కథనంగా మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి.
ఓ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందన్నది ప్రాథమికంగా అందుతోన్న సమాచారం. ఓ నిర్మాతకి చెందిన కారుని రాజ్‌తరుణ్ నడుపుతున్నాడనీ, అయితే తనకు పెద్దగా పరిచయం లేని కారు కావడంతో టర్న్ తిప్పే సమయంలో కొంత గందరగోళానికి గురై కారుని వవేగంగా పోనిచ్చి ప్రమాదానికి కారణమయ్యాడనీ తెలుస్తోంది. ఆ కంగారులోనే రాజ్‌తరుణ్ అక్కడి నుంచి పారిపోయాడన్నది ఓ వెర్షన్.
అయితే, రాజ్ తరుణ్ ఒక్కడే ఆ సమయంలో కారులో వున్నాడా.? ఇంకెవరైనా వున్నారా.? అన్నదానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సాధారణంగా అర్థ రాత్రి వేళ సోలో డ్రైవింగ్‌ని ఎవరూ ఇష్టపడరు. సో, ఖచ్చితంగా కారులో ఎవరో ఒకరు వుండే వుండాలి. ప్రమాదం కారణంగా ఎవరికీ గాయాలు కాలేదు గనుక, అంత వేగంగా పారిపోవాల్సిన అవసరం కూడా రాజ్ తరుణ్‌కి లేదు. కానీ, పారిపోయాడు.. ఇక్కడే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కారుని డ్రైవ్ చేసిందెవరు.? అన్నదానిపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి వుంది.
172227 668898This style is steller! You clearly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (effectively, almostHaHa!) Fantastic job. I really enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 111802
457883 365799you got a very superb internet site, Sword lily I discovered it by means of yahoo. 817199
72769 312200As I site possessor I believe the articles here is quite great, regards for your efforts. 481288