Switch to English

ట్రెండింగ్‌: వైఎస్‌ జగన్‌ ఫెయిల్డ్‌ సీఎం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ మధ్య ‘యుద్ధం’ తారాస్థాయికి చేరింది. ‘వైఎస్‌ జగన్‌ ఫెయిల్డ్‌ సీఎం’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలు వరదల కారణంగా విలవిల్లాడటం వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి పెద్ద తలనొప్పిగా మారింది.

నిజానికి, ఇలాంటి సందర్భాల్లోనే ప్రభుత్వం తమ పనితీరుతో బాధితుల మనసుల్ని గెల్చుకోవాల్సి వుంటుంది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేజేతులా వదిలేసుకున్నారు. వరదలపై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. మంత్రులేమో, వరదల పేరుతో ప్రతిపక్షంపై బురద రాజకీయం షురూ చేశారు. కృష్ణా నదికి వచ్చిన వరదల్నే తీసుకుంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కాపలా కాయడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ‘క్యూ’ కట్టడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

‘అది కనీసం చంద్రబాబు సొంత ఇల్లు కూడా కాదు. అద్దె ఇల్లు.. అయినా, అక్కడికి ఎమ్మెల్యే, మంత్రులు వెళ్ళాల్సిన పనేంటి.? డ్రోన్లతో రాజకీయమేంటి.?’ అని సోషల్‌ మీడియా వేదికగా సాధారణ ప్రజానీకం సైతం ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుందనీ, తమ ప్రభుత్వం బాగా పనిచేస్తోందనీ మంత్రులు చేస్తున్న ప్రకటనలూ వివాదాస్పదమవుతున్నాయి. మంత్రులు, అధికారులు తమను అస్సలేమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. కేవలం చంద్రబాబు ఇంటిని ముంచాలన్న కుయుక్తితో, సామాన్య ప్రజల జీవితాల్ని పణంగా పెట్టారన్న టీడీపీ వాదనకు సోషల్‌ మీడియా వేదికగా మద్దతు లభిస్తోంది.

ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఫెయిలయ్యిందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇదంతా తమ మీద జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమేనని వైసీపీ అంటోంది. ఏదిఏమైనా, అధినేత విదేశాల్లో వుంటే, వైసీపీ పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందో చెప్పడానికి తాజా పరిస్థితులే నిదర్శనం. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంతో, ప్రభుత్వానికీ, పార్టీకీ చెడ్డపేరు వస్తోందని అధికార పార్టీకి చెందిన మద్దతుదారులూ సోషల్‌ మీడియాలో వాపోతుండడం గమనార్హం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...