Switch to English

వైఎస్‌ జగన్‌ ‘ఆ మాట’ అనడానికి అనర్హుడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకున్నా ఇటీవలి ఎన్నికల్లో సంచలన విజయాన్ని అందుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠమెక్కింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రెండున్నర నెలల్లో వైఎస్‌ జగన్‌ ఏం సాధించారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన ఏ వేదిక మీద మాట్లాడినా ‘అవినీతి’ గురించి ప్రస్తావిస్తున్నారు. అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుబడి వుందంటున్నారు.

తాజాగా అమెరికా పర్యటనలోనూ వైఎస్‌ జగన్‌ ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్‌ జగన్‌కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో చాలా రచ్చ జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల విమర్శల సంగతి సరే సరి. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటిన్నది చాలామంది అభిప్రాయం. వారి అభిప్రాయాల్లోనూ వాస్తవం లేకపోలేదు.

అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎంతో కాలం కాలేదు గనుక, వైఎస్‌ జగన్‌ విషయంలో ఇప్పుడే ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు అనవసరం అనే భావన మరికొందరి నుంచి వ్యక్తమవుతోంది. ఓ ఆరు నెలల తర్వాత వైఎస్‌ జగన్‌ పనితీరుపై మాట్లాడితే మంచిదన్నది వారి అభిప్రాయం.

ఇదిలా వుంటే, రాష్ట్రంలో ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి, సొంత పార్టీ నేతలు ఇసుకతో కోట్లు దండుకునేలా వైఎస్‌ జగన్‌ చేస్తున్నారన్న విమర్శ ఒకటి గట్టిగా విన్పిస్తోంది. మరోపక్క, గ్రామ వాలంటీర్ల పోస్టుల్ని అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా అమ్మేసుకున్నారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో ఇంతవరకు వైఎస్‌ జగన్‌, తమ పార్టీ నేతల్ని మందలించిన దాఖలాల్లేవు.

సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే ‘ఇసుక కుంభకోణం’పై పరస్పర ఆరోపణలు చేసకుంటున్నా, వారి విషయమై వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పింది లేదు. ప్రజా వేదికను కూల్చేయడంలో వున్న శ్రద్ధ, అధికార పార్టీ నేతలకు చెందిన ఆస్తులపై దాడులు చేయించడంలో చూపుతున్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధి విషయమై జగన్‌ చూపడంలేదన్న విమర్శలున్నాయి.

అటు పోలవరం, ఇటు అమరావతి.. రెండూ అటకెక్కేశాయ్‌. ఇదిలా వుంటే, స్థానికత అంశంపై జగన్‌ తీసుకున్న నిర్ణయం, పెట్టుబడిదారుల్లో అసహనం పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌, విదేశాలకు వెళ్ళి అవినీతి రహిత పాలన అందిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో రండి.. అని చెప్పడం ఎంతవరకు సబబు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...