Switch to English

ఈ క్రికెట్ బాల్ మాట్లాడుతుంది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

జెంటిల్మన్ గేమ్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అంపైరింగ్ తప్పిదాలు లేకుండా చూసేందుకు ఇప్పటికే ఐసీసీ ఎన్నోరకాల సౌకర్యాలను తీసుకొచ్చింది. బెయిల్స్ వెలగడం, బంతి బ్యాట్ ను తాకిందో తెలుసుకునేందుకు అల్ట్రా ఎడ్జ్, అంపైరింగ్ నిర్ణయాలను సమీక్షించేందుకు డీఆర్ఎస్.. ఇలా ఎన్నో సంస్కరణలు క్రికెట్ లోకి వచ్చి చేరాయి. త్వరలో మరో విప్లవాత్మక మార్పు క్రికెట్ ను పలకరించనుంది. బౌలర్ సంధించిన బంతే.. తనకు సంబంధించిన వివరాలను రియల్ టైమ్ లో చెప్పేస్తుంది.

తన లైన్ లో మార్పు ఏదైనా ఉందా? బ్యాట్ కు తగిలానా లేదా? అది కచ్చితమైన ఎల్బీడబ్ల్యూనే కాదా వంటి వివరాలను ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన బెన్ టాటర్స్ ఫీల్డ్ అనే క్రీడా పరికరాల రూపకర్త ఈ వినూత్నమైన బంతిని రూపొందించాడు. సాధారణ క్రికెట్ బంతిలోనే ఓ మైక్రో చిప్ అమర్చాడు. దీంతో అది తన కదలికలను, వేగాన్ని, వెళుతున్న దిశను కచ్చితంగా లెక్కగట్టి, ఆ వివరాలను రియల్ టైమ్ లో డేటా సెంటర్ కు పంపిస్తుంది.

బౌలర్ తనను ఎంత వేగంతో సంధించాడు? పిచ్ పై సరైన లైన్లోనే విసిరాడా? బ్యాట్ కు తగిలానా లేదా వంటి వివరాలను ఆ బంతే చెప్పేస్తుందన్న మాట. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్ట్రేలియాకు చెందిన క్రీడా పరికరాల తయారీ సంస్థ కూకబుర్రా అంగీకరించింది. బెన్ కు అవసరమై మద్దతు అందిస్తామని పేర్కొంది. ‘తొలిసారిగా బంతి మాట్లాడబోతోంది’ అని కూకబుర్రా ప్రతినిధి షెనాన్ గిల్ వ్యాఖ్యానించారు.

కూకబుర్రా స్మార్ట్ బాల్.. చూడటానికి సాధారణ బంతిలాగే ఉంటుందని, కానీ బౌలర్ విసిరిన బంతికి సంబంధించిన అన్ని వివరాలను డేటా సెంటర్ కు పంపిస్తుందని చెప్పారు. దూరంగా కొట్టినప్పుడు గోల్ప్ బంతి ఎక్కడ పడిందో కచ్చితంగా తెలుసుకోవడానికి అందులో జీపీఎస్ పరికరం అమరిస్తే సరిపోతుంది కదా అని తనకు ఐడియా వచ్చిందని బెన్ పేర్కొన్నాడు. అనంతరం క్రికెట్ బంతిలోనూ ఈ తరహా టెక్నాలజీ ఎందుకు వినియోగించకూడదనే ఆలోచన రావడంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టు వివరించాడు.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఈ బంతి గురించి తెలియజేశామని, పరీక్షల అనంతరం తొలుత కోచింగ్ సెషన్స్ లో దీనిని వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే ఇకపై అంర్జాతీయ క్రికెట్ లో బంతులు మాట్లాడం ఖాయమని ధీమా వ్యక్తంచేశాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...