Switch to English

Rangamarthanda Review: రంగమార్తాండ రివ్యూ: అద్బుతమైన జీవిత గాథ

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow
Movie రంగమార్తాండ
Star Cast ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం
Director కృష్ణ వంశీ
Producer కలిపు మధు, ఎస్.వెంకట్ రెడ్డి
Music ఇళయరాజా
Run Time 2గం 33ని
Release మార్చి 22, 2023

Rangamarthanda Review: దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలం గ్యాప్ తర్వాత చేసిన సినిమా రంగమార్తాండ. తన మార్క్ పోయిందన్న కంప్లైంట్స్ నుండి కృష్ణవంశీ ఈ చిత్రాన్ని చాలా కసితో తీశారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రంగమార్తాండ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు ఇది ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అనిపించింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి వారు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

రంగస్థల నటులు, మంచి స్నేహితులు అయిన రాఘవ రావు, చక్రపాణిల కథ ఇది. వాళ్ళ జీవితాల్లో వివిధ వేదికలపై ఎన్నో స్టేజీల్లో నాటకాలు వేసి మన్ననలు అందుకున్నారు. అంత ఉత్తమమైన జీవితం అనుభవించాక వివిధ కారణాల వల్ల నాటకరంగమైన జీవితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడే వారికి అసలైన నాటకీయత మొదలవుతుంది. ఇక రంగమార్తాండ కథ వీరు తమకు ఎదురైన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు అన్నదానిపై ఫోకస్ పెడుతుంది.

నటీనటులు:

ప్రకాష్ రాజ్ ఎంతటి ఉత్తమ నటుడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అది మరోసారి మనం రంగమార్తాండలో చూస్తాం. అటు ఎమోషనల్ గా కానీ, ఇటు వివిధ ఎమోషన్స్ పరంగా కానీ ప్రకాష్ రాజ్ నటన చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.

ఇక చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం నటన మనల్ని పూర్తిగా సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటిదాకా మనకు అలవాటైన బ్రహ్మానందం కాకుండా పూర్తిగా కొత్త నటుడ్ని చూస్తాం. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. జీవితం యొక్క పరమార్ధం గురించి చర్చించుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇందులో.

రమ్యకృష్ణ చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తన కుటుంబానికి వెన్నుముక లాంటి పాత్ర, నిస్సహాయతను చక్కగా చూపించింది. ఇక మిగిలిన నటీనటులు శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఇంకా మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రల్లో చక్కగా చేసారు.

సాంకేతిక నిపుణులు:

సినిమా అంతటా కృష్ణవంశీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అవ్వడానికి ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చక్కగా మార్పులు చేసాడు కృష్ణవంశీ. దర్శకుడిగా తన మార్క్ ను చూపించాడు ఈ చిత్రంలో. అయితే చిత్ర స్క్రీన్ ప్లే మరీ రొటీన్ గా సాగింది. చాలా సన్నివేశాలు ముందే ఊహించినట్లు సాగుతాయి. అక్కడ ప్రేక్షకుడు బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ రంగమార్తాండ తప్పక చూడాల్సిన చిత్రం.

ఇళయరాజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రెండూ కూడా చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

ప్లస్ పాయింట్స్:

  • లీడ్ పెరఫార్మన్స్స్
  • ఎమోషనల్ కనెక్ట్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్క్రీన్ ప్లే

విశ్లేషణ:

మంచి ఎమోషనల్ వేల్యూతో పాటు కుటుంబ కథ పరంగా కూడా రంగమార్తాండ ఒక మంచి చిత్రం. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...