టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. కర్ణాటకలోని బళ్లారిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బళ్లారిలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ మొదటి రోజు వేడుకల్లో పాల్గొని తిరిగు ప్రయాణంలో ఉండగా కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కార్యక్రమంలో భాగంగా మంగ్లీ స్టేజీపై పాటలు పాడారు. అనంతరం ఆమెను చూసేందుకు స్థానిక యువకులు వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్ లోపలికి ప్రవేశించగా పోలీసులు వారిని అడ్డుకన్నారు. అయితే.. రాళ్ల దాడికి కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన కారణమని తెలుస్తోంది.
ఇటివల చిక్కబళ్లాపుర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గగొన్న మంగ్లీని కన్నడలో మాట్లాడాలని యాంకర్ అనుశ్రీ కోరారు. అయితే.. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ తెలుగులోనే మాట్లాడారు. యాంకర్ బలవంతంతో కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంగ్లీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి వచ్చి 2ఏళ్లు దాటినా కన్నడ అర్థం కానప్పుడు.. కన్నడలో మాట్లాడటానికి భయపడుతున్నప్పుడు ఆమెకు ఇక్కడ అవకాశాలు ఎందుకు ఇస్తారని మండిపడుతున్నారు.
398119 884152dog grooming could be the specialty of my sister, she really loves grooming every dog in our house 388571
47322 376938Excellent post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the best sequence of my past and your content material kind of reminded me of that period of my life. Cheers 116642