మంచు వారి కోడలు.. మంచు విష్ణు భార్య విరానిక ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది. న్యూయార్క్ యూనివర్శిటీలో ఫ్యాషన్ మార్కెటింగ్ లో శిక్షణ పొంది మైసన్ అవా పేరుతో వస్త్ర వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం విరానిక బ్రైడల్ డిజైనర్ వేర్ ప్రారంభించింది. ఈక్రమంలో ఆమె రూపొందించిన చీరను సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధరించింది. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మృణాల్ జరీ గోల్డ్ టిష్యూ కాంచీవరం చీర ధరించింది. ఈ చీర తయారే చేసేందుకు ఏకంగా 980 గంటలు పట్టిందట. తెల్లటి చీరలో మెరిసిపోతున్న మృణాల్ మల్లె తోటలో మరింత 18 మీటర్ల పొడవున్న తెల్లటి చీరలో మరింత అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ చీర ధర కూడా అదరహో అనే రేంజ్ లోనే ఉంటుందని అంటున్నారు. విరానిక క్లాత్ బిజినెస్ తోపాటు ది కేక్ రూమ్ పేరుతో కేక్స్ బిజినెస్ కూడా నడుపుతోంది. తెల్ల చీరలో ఉన్న తన ఫొటో కూడా విరానిక పోస్ట్ చేసింది.