Switch to English

‘వీర సింహా రెడ్డి’పై ‘వాల్తేరు వీరయ్య’ ప్యూర్ డామినేషన్.! ఇదే సాక్ష్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

వసూళ్ళు, రెమ్యునరేషన్.. ఈ లెక్కల్లో చిరంజీవికీ, బాలకృష్ణకీ అస్సలు పోటీ లేదు. చిరంజీవి ఎప్పుడూ అగ్రస్థానంలోనే వుంటూ వచ్చారు. రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్ళినాగానీ, నంబర్ వన్ పొజిషన్ ఆయన్నుంచి చేజారిపోలేదు. ఇంకెవరికీ అది దక్కలేదు కూడా.!

చాన్నాళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్‌బాబు ఓ సందర్భంలో మాట్లాడుతూ, ‘తెలుగు సినిమాకి చివరి సూపర్ స్టార్ చిరంజీవి. వన్ టూ టెన్ ఆయనే.. ఆ తర్వాతి స్థానం కోసమే మా మధ్య పోటీ.. ప్రతి శుక్రవారం హీరోల స్థానాలు మారిపోతుంటాయ్..’ అని చెప్పాడు.

అదే నిజం.! కానీ, బాస్ ఈజ్ బ్యాక్.! సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది మొదలు, తనదైన సత్తా చాటుతూనే వున్నారు. మధ్యలో ‘ఆచార్య’ని మినహాయిస్తే, చిరంజీవి మేనియా ఎక్కడా తగ్గలేదు. పాన్ ఇండియా సినిమాలొస్తుండొచ్చు.. యంగ్ హీరోలు వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుండొచ్చు.. కానీ, ఆ మెగా మాస్ యుఫోరియా మాత్రం చిరంజీవి చుట్టూ అలా వైఫైలా కొనసాగుతూనే వుంది.

‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాల మధ్యన పోలిక పెట్టి, ‘వాల్తేరు వీరయ్య’ని తక్కువ చేసి చూసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఓవర్సీస్‌లో ప్రీ-బుకింగ్స్‌ని ఆధారంగా చూపి, ‘వాల్తేరు వీరయ్య’ని తొక్కిపెట్టేందుకు జరిగిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.

బల్క్ బుకింగులు, చందాలేసుకుని మరీ.. టిక్కెట్లు కొనడాలు.. ఇవన్నీ ‘వీర సింహా రెడ్డి’కి టెంపరరీ ఊపు తెచ్చాయ్.. కానీ, అక్కడ ప్యూర్ డామినేషన్ చిరంజీవిదేనని తేలిపోయింది. అవలీలగా 2 మిలియన్ల క్లబ్‌లోకి చేరింది ‘వాల్తేరు వీరయ్య’ సినిమా.

‘ప్యూర్ మెగా డామినేషన్..’ అంటూ ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, మెగాస్టార్ చిరంజీవి స్టామినా గురించి చెప్పకనే చెప్పేసింది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళ విషయానికొస్తే, 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ‘వాల్తేరు వీరయ్య’.. అదీ తొలి వారంలోనే. జస్ట్ ఏడు రోజుల్లో సాధించిన వసూళ్ళు ఇవి. ‘వీర సింహా రెడ్డి’ ఇంకా 110 కోట్ల దగ్గరలో వుంది. షేర్ పరంగా చూసుకున్నా, ‘వాల్తేరు వీరయ్య’ చాలా అడ్వాన్స్‌డ్‌గా వుంది. దాదాపుగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయినట్లే షేర్స్ పరంగా ‘వాల్తేరు వీరయ్య’.

‘వీర సింహా రెడ్డి’ అయితే షేర్స్ పరంగా వంద కోట్ల మైలు రాయికి చాలా దూరంలో నిలిచిపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఓ రోజు ముందు విడుదలైన ‘వీర సింహా రెడ్డి’కి తొలి రోజు వసూళ్ళ విషయంలో అడ్వాంటేజ్ లభించిన సంగతి తెలిసిందే. కానీ, ఓవరాల్‌గా ‘వాల్తేరు వీరయ్య’కు ఎదురే లేకుండా పోతోంది.

నైజాంలో తొలి వారం రోజుల్లో ‘వాల్తేరు వీరయ్య’ ఏకంగా 25.92 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 14.61 కోట్లు వచ్చింది. ఉత్తరాంధ్ర 11.34, ఈస్ట్ 8.25 కోట్లు, వెస్ట్ 4.61 కోట్లు, గుంటూరు 6.2 కోట్లు, కృష్ణా 6.92 కోట్లు, నెల్లూరు 3.01 కోట్లు వచ్చాయి. కర్నాటక, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 6 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లెక్క 10.6 కోట్లు. 165.4 కోట్లు గ్రాస్, 96.46 కోట్ల షేర్ వచ్చింది తొలి వారం రోజుల్లో.

అదే ‘వీర సింహా రెడ్డి’ విషయానికొస్తే, నైజా 15.41 కోట్లు, సీడెడ్ 15.17 కోట్లు, ఉత్తరాంధ్ర 6.41 కోట్లు, ఈస్ట్ 4.94, వెస్ట్ 3.77 కోట్లు, గుంటూరు 5.97 కోట్లు, కృష్ణా 4.24 కోట్లు, నెల్లూరు 2.6 కోట్లు, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో 4.5 కోట్లు, ఓవర్సీస్‌లో 5.5 కోట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 114.95 కోట్ల గ్రాస్, 68.5 కోట్ల షేర్ వసూలు చేసింది. దాదాపుగా ‘వీర సింహా రెడ్డి’కి ఇకపై షేర్ వచ్చే అవకాశం కన్పించడంలేదు.

‘వీర సింహా రెడ్డి’కి పాజిటివ్ రివ్యూలొచ్చాయ్ చాలావరకు. ‘వాల్తేరు వీరయ్య’కి వ్యతిరేకంగా పెద్ద మాఫియానే నడిచింది.. అందులో మీడియా కూడా భాగమైంది. అయినాగానీ, ‘వాల్తేరు వీరయ్య’ మెగా వసూళ్ళ జోరుకి మాత్రం ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోయారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...