రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పలు అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలో హాలీవుడ్ పత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. భారత్ తరపు నుంచి అధికారికంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు ఎంట్రీ ఇవ్వకపోవడం తనను బాధించిందని చెప్పుకొచ్చారు. అయితే.. ఇలా ఎందుకు జరిగిందనే అంశం దగ్గరే తాను ఆగిపోనని అన్నారు. దానిపైనే ఆలోచిస్తూ కూర్చునే వ్యక్తులం కాదని కూడా స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్ అధికారికంగా ఎంట్రీ ఇచ్చుంటే బాగుండేదని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలా పని చేస్తుంది.. నియమ నిబంధనలేంటనే విషయం నాకు తెలియదు. కాబట్టి.. దీనిపై ఎక్కువగా కామెంట్ చేయదలచుకోలేదు. దేశం నుంచి అధికారికంగా నామినేట్ అయిన లాస్ట్ ఫిల్మ్ షోకు గుడ్ లక్ చెప్తున్నా.. అని అన్నారు. ఇప్పటికే నాటునాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ షార్ట్ లిస్టుకు ఎంపికైంది. గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులూ గెలుచుకుంది.