టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోయిన్లు కలలు కంటుంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత అలాంటిది మరి. అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వని త్రివిక్రమ్‌పై తాజాగా ఓ హీరోయిన్ నమ్మలేని ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తనను మోసం చేశాడని.. తన కెరీర్ నాశనం కావడానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇంతకీ త్రివిక్రమ్ ఎవరిని మోసం చేశాడు.. ఆయన వల్ల ఆ హీరోయిన్ కెరీర్ ఎలా నాశనం అయ్యింది.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగులో ‘ధర్మచక్రం’ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ ప్రేమ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకవడంలో సక్సెస్ అయ్యింది. అయితే తన కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు, ‘చిరునవ్వుతో’ సినిమాలో నటించడం తాను చేసిన అతిపెద్ద తప్పుగా ఆమె ఇప్పుడు చెబుతోంది. ఆ సినిమాలో తనకు చెప్పిన పాత్ర ఒకటని, కానీ సినిమాలో చూపించిన పాత్ర వేరని ఆమె పేర్కొంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేమ ఈ విధంగా కామెంట్స్ చేసింది.
వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తనది కీలకమైన పాత్ర అని త్రివిక్రమ్ తనను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడని, అయితే తనది కనీసం క్యారెక్టర్ పాత్రలా కూడా తీర్చిదిద్దలేదని ఆమె ఆరోపిస్తుంది. ఇక తనకు సంబంధించిన పాత్ర నిడివి కూడా తగ్గిందని ఆమె తెలిపింది. ఇలా త్రివిక్రమ్ తనను పూర్తిగా మోసం చేశాడని ఆమె తెలిపింది. అయితే చిరునవ్వుతో సినిమా చేయడంతో తన కెరీర్ పూర్తిగా నాశనమయ్యిందని ఆమె పేర్కొంది. మరి గతంలో చేసిన సినిమా గురించి ప్రేమ ఇప్పుడు త్రివిక్రమ్‌పై ఆరోపణ చేయడం ఏమిటని పలువురు కామెంట్ చేస్తున్నారు.
222378 430740Woh I enjoy your posts , bookmarked ! My wife and i take problem along together with your last point. 908611
153922 952132Now we know who the ssebnile one is here. Wonderful post! 60235
214907 65804I genuinely like this weblog site, will surely come back once more. Make positive you carry on creating quality content articles. 333144
83298 844989This is how to get your foot within the door. 741632