యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో కొరటాల అండ్ టీమ్ బిజీగా ఉన్నారు.
కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తెలిపాడు. తాజాగా కొరటాల శివతో కలిసి ఆయన ఈ సినిమా సంగీతానికి సంబంధించిన చర్చలు జరుపుతున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇక చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు అనిరుధ్ నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడట.
ఇప్పటికే శాంపిల్‌గా కొన్ని ట్యూన్స్‌ను అనిరుధ్ కొరటాలకు వినిపించగా, ఆయన పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే ఈ సినిమా మ్యూజిక్ చాలా స్పెషల్‌గా ఉండబోతుందని అనిరుధ్ తెలిపాడు. కాగా ఈ సినిమాలో తారక్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లుగా ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ అనౌన్స్మెంట్ వీడియో గ్లింప్స్‌లో మనకు చూపించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతిత్వరలో స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలపగా, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
141041 830069Extremely interesting topic , appreciate it for putting up. 961458
574974 762858Yay google is my king helped me to uncover this outstanding website! . 688865
500271 353748I got what you intend,bookmarked , quite decent internet site . 6745
185101 264722You made some decent points there. I looked online for that issue and discovered many people goes coupled with with all your site. 914879