Switch to English

ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ: బిలో యావరేజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow
Movie ఊర్వశివో రాక్షశివో
Star Cast అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్
Director రాకేష్ శశి
Producer ధీరజ్ మొగిలినేని
Music అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి
Run Time 2గం 24ని
Release 4 నవంబర్, 2022

చాలా కాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ కంబ్యాక్ ఇస్తోన్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

శిరీష్, అను ఇద్దరూ ఒకే ఐటి కంపెనీలో పనిచేసే భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతుంది. శారీరికంగా కూడా ఒకటవుతారు. శిరీష్, అను ను డీప్ గా లవ్ చేయడం మొదలుపెడతాడు అయితే అనుకి అలాంటి ఆలోచనలు ఉండవు. దీన్ని క్యాజువల్ రిలేషన్ గా తీసుకుంటుంది.

ఒకదాన్నుండి ఒకటి వచ్చి, ఇద్దరూ లివిన్ లో ఉంటారు. అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి శిరీష్, అమెరికా అమ్మాయి అనుతో ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది ఈ చిత్ర కథ.

నటీనటులు:

నేటి తరం అబ్బాయి, అమ్మాయిలను రిప్రెసెంట్ చేసారు శిరీష్, అను ఇమ్మానుయేల్. ఇద్దరూ కూడా డీసెంట్ గా చేశారనే చెప్పాలి. శిరీష్ లో ఈజ్ కనిపించింది. ఇక అను చూడటానికి చాలా బాగుంది. ఈ చిత్ర పోజిటివ్స్ లో ఆమె కూడా ఒకరు.

వెన్నెల కిషోర్, సునీల్ లో కామెడీ పంచడానికి ప్రయత్నించారు కానీ అది సహజంగా అనిపించదు. ఇంకా ఈ చిత్రంలో ఆమని, పృథ్వీ, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు రాకేష్ శశి ఒక సింపుల్ యూత్ ఫుల్ కథను నేటితరం ఆలోచనలకు అన్వయించి రూపొందించాడు. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే డ్రామా ఉన్న కాస్త ఆసక్తిని కూడా చల్లార్చేస్తుంది. ఈ చిత్రం రెండున్నర గంటలే అయినా కనీసం మూడు గంటలు చూశామన్న అనుభూతి కలిగిస్తుంది. అంతలా డ్రాగ్ అయింది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మలచలేదు.

ఇక పాటలు పెద్దగా ఎక్కే అవకాశాలు లేవు. అరెరే మినహాయిస్తే దేనికీ రిపీట్ వేల్యూ లేదు. బిజిఎమ్ పర్వాలేదనిపించే రీతిలో ఉంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రన్ టైమ్ డీసెంట్ గానే ఉన్నా ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు అనిపిస్తుంది.

పోజిటివ్స్:

  • అను ఇమ్మానుయేల్
  • కొన్ని చోట్ల కామెడీ
  • యూత్ కు నచ్చే కొన్ని సన్నివేశాలు

నెగటివ్స్:

  • కథ, స్క్రీన్ ప్లే
  • స్లో నరేషన్
  • మంచి సాంగ్స్ లేకపోవడం

విశ్లేషణ:

ఊర్వశివో రాక్షసివో లో అను కచ్చితంగా ఊర్వశిలా అనిపిస్తుంది. ఉన్న కొద్దిపాటి పోజిటివ్స్ లో అను కూడా ఒకరు. ఈ తరం రిలేషన్స్, యువత ఆలోచనలను అనాసక్తికరంగా మలిచాడు దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఉండాల్సిన లక్షణాలు ఈ సినిమాలో కొరవడ్డాయి. మొత్తానికి బిలో యావరేజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది ఈ చిత్రం.

తెలుగుబులెటిన్. కామ్ రేటింగ్: 2/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...