Switch to English

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతున్న ఓ వీడియో లీక్ అయ్యింది. వీడియో కాల్ ద్వారా నగ్నంగా తన దేహాన్ని ఓ మహిళకు గోరంట్ల మాధవ్ చూపించారన్నది ఈ వీడియోలో తేటతెల్లమవుతున్న విషయం. ‘అది హండ్రెడ్ పర్సెంట్ మార్ఫింగ్..’ అంటున్నారాయన. గతంలో పోలీస్ అధికారిగా పని చేశారు గనుక, ఆయనకే తెలుసు.. అది మార్ఫింగ్ వీడియోనా.? కాదా.? అన్నది.

పైగా, మార్ఫింగ్ వీడియోనో కాదో తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఆయనకు తెలుసు. పద్ధతి ప్రకారం వ్యవస్థలు పనిచేస్తే, ఈపాటికే అది మార్ఫింగ్ వీడియోనో కాదో తెలిసిపోయేది. కానీ, విషయం బయటకు రావడంలేదు. ‘కఠిన చర్యలుంటాయ్..’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూచాయిగా చెప్పారు. కానీ, ఆ చర్యలెక్కడ.? ఎప్పుడు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇంతలోనే, కులాల కుంపటి తెరపైకొచ్చింది. ‘కమ్మనాయాళ్ళు..’ అంటూ గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడంతో, కమ్మ సామాజిక వర్గ ప్రతినిథుల స్పందించారు. ‘కమ్మ సమాజానికి గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలి..’ అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా, ఈ పాయింట్ కోసమే ఎదురుచూస్తోన్న గోరంట్ల మాధవ్ మద్దతుదారులు, ‘కురుబ సామాజిక వర్గాన్ని’ తెరపైకి తెచ్చారు.

ఓ ఎంపీ నిస్సిగ్గుగా తన నగ్న దేహాన్ని బహిర్గతం చేశారన్నది ఇక్కడ ఆరోపణ. ఓ నాయకుడి వెకిలి చేష్టలపై చర్చ జరగాలిక్కడ. కానీ, చిత్రంగా కులాల పంచాయితీ తెరపైకొచ్చింది. ఏకంగా 150 కోట్ల స్కాం.. అంటూ ఈ మొత్తం వ్యవహారంపై గోరంట్ల మాధవ్ మద్దతుదారులు ఆరోపిస్తుండడం కొసమెరుపు ఇక్కడ. మరీ, అంత ‘నిర్లజ్జగా’ 150 కోట్ల ఆరోపణలు ఎలా చేస్తారబ్బా.? అంటూ సామాన్యులు విస్తుపోతున్నారు.

‘ఆ వీడియో నిజమైనదో కాదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి..’ అంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు మంత్రి రోజా. ‘ఊరకనే ఆరోపణలు చేసెయ్యకూడదు’ అని కూడా అంటున్నారామె. కానీ, మంత్రి రోజా మాత్రం, రాజకీయ ప్రత్యర్థులపై అడ్డగోలు ఆరోపణలు చేసెయ్యొచ్చు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌లో రోజా ఇలా తేలిక వ్యాఖ్యలు చేయడంతో, కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయ్.. ఈ కేసు నీరుగారిపోయిందని.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...