‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.!
హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్దిగా చెప్పబడుతున్న ఓ వీడియో లీక్ అయ్యింది. వీడియో కాల్ ద్వారా నగ్నంగా తన దేహాన్ని ఓ మహిళకు గోరంట్ల మాధవ్ చూపించారన్నది ఈ వీడియోలో తేటతెల్లమవుతున్న విషయం. ‘అది హండ్రెడ్ పర్సెంట్ మార్ఫింగ్..’ అంటున్నారాయన. గతంలో పోలీస్ అధికారిగా పని చేశారు గనుక, ఆయనకే తెలుసు.. అది మార్ఫింగ్ వీడియోనా.? కాదా.? అన్నది.
పైగా, మార్ఫింగ్ వీడియోనో కాదో తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఆయనకు తెలుసు. పద్ధతి ప్రకారం వ్యవస్థలు పనిచేస్తే, ఈపాటికే అది మార్ఫింగ్ వీడియోనో కాదో తెలిసిపోయేది. కానీ, విషయం బయటకు రావడంలేదు. ‘కఠిన చర్యలుంటాయ్..’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూచాయిగా చెప్పారు. కానీ, ఆ చర్యలెక్కడ.? ఎప్పుడు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇంతలోనే, కులాల కుంపటి తెరపైకొచ్చింది. ‘కమ్మనాయాళ్ళు..’ అంటూ గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడంతో, కమ్మ సామాజిక వర్గ ప్రతినిథుల స్పందించారు. ‘కమ్మ సమాజానికి గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలి..’ అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా, ఈ పాయింట్ కోసమే ఎదురుచూస్తోన్న గోరంట్ల మాధవ్ మద్దతుదారులు, ‘కురుబ సామాజిక వర్గాన్ని’ తెరపైకి తెచ్చారు.
ఓ ఎంపీ నిస్సిగ్గుగా తన నగ్న దేహాన్ని బహిర్గతం చేశారన్నది ఇక్కడ ఆరోపణ. ఓ నాయకుడి వెకిలి చేష్టలపై చర్చ జరగాలిక్కడ. కానీ, చిత్రంగా కులాల పంచాయితీ తెరపైకొచ్చింది. ఏకంగా 150 కోట్ల స్కాం.. అంటూ ఈ మొత్తం వ్యవహారంపై గోరంట్ల మాధవ్ మద్దతుదారులు ఆరోపిస్తుండడం కొసమెరుపు ఇక్కడ. మరీ, అంత ‘నిర్లజ్జగా’ 150 కోట్ల ఆరోపణలు ఎలా చేస్తారబ్బా.? అంటూ సామాన్యులు విస్తుపోతున్నారు.
‘ఆ వీడియో నిజమైనదో కాదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి..’ అంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు మంత్రి రోజా. ‘ఊరకనే ఆరోపణలు చేసెయ్యకూడదు’ అని కూడా అంటున్నారామె. కానీ, మంత్రి రోజా మాత్రం, రాజకీయ ప్రత్యర్థులపై అడ్డగోలు ఆరోపణలు చేసెయ్యొచ్చు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో రోజా ఇలా తేలిక వ్యాఖ్యలు చేయడంతో, కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయ్.. ఈ కేసు నీరుగారిపోయిందని.!
989378 148723Greatest fighter toasts ought to entertain and supply prize on your couples. Initially audio system next to obnoxious crowd would be wise to comprehend 1 particular gold colored strategy as to public speaking, which is private interests self. very best man jokes 109688
28313 204057I like this website quite considerably so a lot superb data. 465196
452025 689988Sweet site , super pattern , rattling clean and use friendly . 541679
739215 401742Yay google is my king helped me to discover this wonderful website ! . 846247
643606 681753Pretty part of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly fast. 910663
152917 659042hello!,I truly like your writing quite a great deal! percentage we keep up a correspondence extra about your post on AOL? I need an expert on this location to unravel my dilemma. May possibly be that is you! Taking a appear forward to peer you. 559416