Switch to English

బాబాయ్‌పై గొడ్డలి వేటుకీ, పిన్ని ఉరితాడుకీ తేడా తెలియని రాజకీయ మూర్ఖత్వమిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయ్.? ఈ మాట ప్రతిసారీ.. అనుకోవాల్సి వస్తూనే వుంది. దిగజారడంలో ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని వెతుకుతూనే వున్నారు రాజకీయ నాయకులు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో వుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ అది.

అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే, దాన్ని తొలుత గుండె పోటుగా ప్రచారం చేయడంతోనే.. ‘బాబాయ్‌ని చంపిందెవరు.?’ అన్న ప్రశ్న అంత హాట్ టాపిక్ అయ్యింది.. అవుతూ వస్తోంది కూడా.!

ఆ దారుణ హత్యకీ, అనారోగ్యంతో.. మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న కంఠమనేని ఉమామహేశ్వరి (స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె) ఉదంతానికీ ఏమైనా సంబంధం వుందా.? ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ప్రచారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ నాయకుల మానసిక స్థితిపై ఎలాంటి అంచనాకు రావాలో అర్థం కావడంలేదిప్పుడు.!

‘అవతలి వాళ్ళ చావు బతుకుల మీద అవాకులు చవాకులు పేలే పచ్చ పిచ్చ మీడియాకి.. బెడ్రూమ్‌లో వేలాడుతున్న పిన్ని శవం మీద, ఉరి తాడు ఎవరు లాగారో, పది మందికి పైగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వున్న ఎన్టీయార్ కూతురికి అంత ఖర్మ ఎందుకు పట్టిందో డిబేట్లు పెట్టే సత్తా లేదా.? ఇప్పుడు పెట్టండ్రా డిబేట్లు..’ అంటూ వైసీపీ నేత దేవేందర్ రెడ్డి గుర్రంపాటి వేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

‘పైశాచిక ఆనందం’ అనేది చాలా చాలా చిన్నమాట.. అన్నది దేవేందర్ రెడ్డి గుర్రంపాటి ట్వీట్ తర్వత సర్వత్రా వినిపిస్తోన్న అభిప్రాయం. అక్కడ ఎన్టీయార్ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె ఇలా అకాల మరణం, అందునా బలవన్మరణం పాల్పడటంపై అంతటా విస్మయం వ్యక్తమవుతోంది. అసలామెకు రాజకీయాలతో సంబంధం లేదు. ఏనాడూ వివాదాల్లోకి ఆమె ఎక్కింది లేదు.

కేవలం చంద్రబాబు మీద రాజకీయ కక్షతో, టీడీపీ అను‘కుల’ మీడియాపై అక్కసుతో.. ఇంత హేయంగా వ్యవహరిస్తారా.? చంద్రబాబు మీద వ్యతిరేకత వుంటే, ఆయన మీద రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు. టీడీపీ అను‘కుల’ మీడియాపై అక్కసు వుంటే, దాన్ని తీర్చుకోవడానికీ వేరే అవకాశాలు చాలానే వుంటాయ్.

శవ రాజకీయం.. అనేది నిజానికి చాలా చాలా చిన్నమాట. నిజమే, గుండె పోటుకీ గొడ్డలి పోటుకీ తేడా తెలియని మూర్ఖులనుంచి ఇలాంటి నీఛ రాజకీయం తప్ప ఇంకేం ఆశించగలం.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...