Switch to English

చిరంజీవి బర్త్ డే స్పెషల్స్: ట్రైన్ ఫైట్, డిస్కో డ్యాన్సులతో కిక్కెక్కించిన చిరంజీవి ‘గూండా’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

చిరంజీవి సినిమా కంటే.. ‘చిరంజీవి’ అనే పేరే సినీ అభిమానులకు కిక్కెక్కిస్తున్న రోజులవి. అప్పటికే అయిదేళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న చిరంజీవి ప్రేక్షకుల గుండెల్లో స్థానం.. అభిమానులకు ఆరాధ్య దైవం.. సినీ పరిశ్రమకు వరంలా.. దర్శక, నిర్మాతలకు లక్కీ డీప్ అయిపోయారు. ‘ఖైదీ’కి ముందు చిరంజీవి సంచలనం అయితే.. ‘ఖైదీ’ తర్వాత ప్రకంపనలే సృష్టించారు. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. ధియేటర్లు కిక్కిరిసిపోవడమే. టాక్ తో సంబంధంలేని వసూళ్లతో ధియేటర్లలో హోరెత్తిపోయేవి. చిరంజీవి ప్రభ అలా వెలిగితున్న దశలో వచ్చిన మరో సూపర్ హిట్ ‘గూండా’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా అభిమానులకు ఇప్పటికీ ఫేవరేట్.

చిరంజీవి బర్త్ డే స్పెషల్స్: ట్రైన్ ఫైట్, డిస్కో డ్యాన్సులతో కిక్కెక్కించిన చిరంజీవి ‘గూండా’

డూప్ లేకుండా ట్రైన్ ఫైట్..

‘ఖైదీ’ తర్వాత చిరంజీవి సినిమా టైటిల్స్ రెండు అక్షరాలతో రావడం ఓ ట్రెండ్. అలా వచ్చిందే ‘గూండా’. ఇటివల హీరో గోపీచంద్.. తన కొత్త సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో గూండా సినిమాలో చిరంజీవి చేసిన రిస్కీ ఫైట్ గురించే ప్రస్తావించారు. ఇన్నేళ్లయినా గూండాలో చిరంజీవి చేసిన సాహసాలు, ట్రైన్ ఫైట్ ఇంకా గుర్తున్నాయంటే అందుకు చిరంజీవి శ్రమే కారణం. ట్రైన్ వెళ్తూండగా అడుగున ఎటువంటి డూప్ లేకుండా వేలాడుతూ చిరంజీవి చేసిన సాహసాలు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేవారు. ఇంతటి సాహసం అవసరమా అని తండ్రి వెంకట్రావు అంటే.. నవ్వి ఊరుకునేవారట చిరంజీవి. అలసిపోయి నిద్రిస్తున్న తన ఒళ్లు తండ్రి వెంకట్రావు పట్టేవారని కూడా చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.

డిస్కో డ్యాన్సులతో అలరించి..

సినిమాలో పాటలకు చిరంజీవి చేసిన డ్యాన్సులు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ను అలరించాయి. చక్రవర్తి సంగీతంలోని పాటలకు చిరంజీవి చేసిన హుషారైన స్టెప్పులకు ధియేటర్లో విజిల్స్ పడ్డాయి. అప్పట్లో డిస్కో డ్యాన్సు ఫేమస్. అసలే డ్యాన్స్ ను ఎంతో ఇష్టంతో చేసే చిరంజీవి ఈ సినిమాలో డిస్కో డ్యాన్సులతో హుషారెత్తించారు. చిరంజీవి డ్యాన్సులు, చిత్రీకరణ, బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. పాటల్లో చిరంజీవి చూపే ఉత్సాహం నిర్మాతలకు కనకవర్షాన్నే కురిపించాయి. కథగా తండ్రీ, కొడుకుల ఎమోషన్.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి.. అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్ స్టర్ గా పోలీస్ ఆఫీసరైన తండ్రికి చేరువయ్యే పాత్రలో చిరంజీవి నటించారు. ఈ కంటెంట్ కూడా ప్రేక్షకులకు నచ్చింది. దీంతో సినిమా సూపర్ హిట్ అయింది.

రాధతో హిట్ పెయిర్ గా..

1984 మార్చి 22న విడుదలైన గూండా.. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. చిరంజీవికి బాగా కలిసొచ్చిన.. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఎ.కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ రాజ్యలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత మిద్దే రామారావు సినిమా నిర్మించారు. అద్భుత విజయం సాధించడంతో సినిమా 11 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని కొన్ని కేంద్రాల్లో 150 రోజుల వరకూ ఆడింది. చిరంజీవి కెరీర్లో ఆయనకు హిట్ పెయిర్ గా నిలిచింది హీరోయిన్ రాధ. ఎన్నో మధురానుభూతులు మిగిల్చిన ఈ యాక్షన్-సెంటిమెంట్ మూవీ సినీ అభిమానులకు ఇప్పటికీ ఆసక్తే. సినిమా కోసం చిరంజీవి ఎంతగా కష్టపడేవారో అనేందుకు ‘గూండా’ ఒక ఉదాహరణ.

ట్రైన్ ఫైట్, డిస్కో డ్యాన్సులతో కిక్కెక్కించిన చిరంజీవి ‘గూండా’

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...