Switch to English

వైసీపీ ఎంపీల భావ‘దారిద్ర్యం’.! అత్యంత జుగుప్సాకరం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

భావానికి ‘దరిద్రం’ పడితే ఎలా వుంటుంది.? సోషల్ మీడియాలో, వైసీపీ నేతల ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. తమ ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చి, దాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా, వీలైనంత ఎక్కువమందికి చేరవేయడం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే తప్పు లేదు.

కానీ, ‘భావం’, ‘ఆలోచన’ వంటివాటికి దరిద్రం పట్టినట్లు, సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిథుల అభిప్రాయాలు కావొచ్చు, రాజకీయ విమర్శలు కావొచ్చు కనిపిస్తే ఎలా వుంటుంది.? అదీ, అధికార వైసీపీకే చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిథులు, పైగా పార్లమెంటు సభ్యులు తమ స్థాయిని దిగజార్చేసుకుంటే ఎలా వుంటుంది.?

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, గత కొంతకాలంగా పార్టీకి దూరంగా వుంటున్నారు. అయినాగానీ, ‘నేను వైసీపీ నాయకుడినే.. మా పార్టీ నన్ను దూరం పెట్టింది. నేనేమీ పార్టీకి దూరంగా లేను..’ అని చెబుతున్నారాయన. ఇంకోపక్క, రఘురామ మీద వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతుంటారు తప్ప, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు.

ఇరు పక్షాలూ కలిసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు.? ఇంకేమిస్తారు, బూతు సందేశం, జుగుప్సాకరమైన సందేశం ఇస్తారు, ఇస్తున్నారు కూడా.! మీడియాకెక్కి రఘురామ చేసే వ్యాఖ్యలు, వాటిపై వైసీపీ కౌంటర్ ఎటాక్ చూస్తూనే వున్నాం.

తాజాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ రోత పుట్టించే రాతని ట్విట్టర్‌లో వదిలారు. దీన్ని రాత కాదు, రెట్ట.. అనాలి. ‘విగ్గు, పెగ్గు అనే బ్యాంకు దొంగ…ఒక నికృష్టుడు దుర్గంధం వెదజల్లే కుళ్లిన శవంలాంటి వాడు. దేహం పగుళ్లుబారి రసికారుతోంది. దానిని పురుగులు తినేదాక మనం కాస్త దూరంగా ఉండక తప్పదు’ అన్నది ఆ ట్వీటు.

కాస్త ఆలస్యంగా విజయసాయిరెడ్డి ట్వీటుపై స్పందించారు రఘురామకృష్ణరాజు. ‘కడుపుకి అన్నం తినే వారు ఇలా మాట్లాడగలరా? ఇంత చెత్తగా వాగే నాయకులను ఏమనాలి? శవాన్ని పక్కలో (పార్టీలో) ఎందుకురా మరి పెట్టుకున్నారు అని అడుగుదామా ఈ దరిద్రులని? ప్రజలారా మీరే ఆలోచించండి’ అంటూ ట్వీటేశారు.

ఇంతకీ, సాధారణ నెటిజన్లు ఏమనుకుంటున్నారు, వైసీపీ నేతల జుగుప్సాకరమైన ట్వీట్ల యుద్ధంపై.?

‘ఇద్దరూ గొప్ప భాషా పండితులే.. మంచి ఆర్థిక వేత్తలు, సమాజ సేవకులే.. పార్టీలోనుంచి నువ్వూ పోవు, వాళ్ళు పంపరు.. కొట్టుకు ఛావండి.. మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యండి..’ అంటూ ట్వీటేశాడు ఓ నెటిజన్.

పార్లమెంటు ప్రజా ప్రతినిథులే ఇంతలా బరితెగించేశాక, సామాన్యులెలా స్పందిస్తారు.? అంతకు మించిన జుగుప్సాకరమైన రీతిలోనూ ఇద్దరికీ తగిన సమాధానమిస్తున్నారు నెటిజన్లు. కేవలం వ్యవస్థల్ని నాశనం చేయడం కోసమే, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేయడానికే వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చారా.? అన్న అనుమానం కలిగితే అది మీ తప్పు కాదు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...