‘కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా సాధించేస్తాం..’ అంటూ గతంలో బీరాలు పలికింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో, కేంద్రాన్ని ప్రశ్నించేస్తూ (!?) ప్రత్యేక హోదా కోసం ఏకంగా నిరాహార దీక్ష చేసేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అంతేనా, ఎన్నికలు జరిగే పరిస్థితి వుండదనే ‘హామీ’ దక్కేదాకా ఎదురుచూసి, ప్రత్యేక హోదా కోసమంటూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు కూడా.
రాష్ట్రంలో రాజకీయం ఎంత వెకిలిగా తయారైందో చెప్పడానికి ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, అధికారాన్ని పంచుకుని, ప్రత్యేక హోదా దండగని చెప్పి, ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది.
అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ అలాగే, టీడీపీ.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి బీ-టీమ్స్గానే వ్యవహరిస్తున్నాయి. అలాంటప్పుడు, బీజేపీ మిత్రపక్షం జనసేన మాత్రం, ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు నడుస్తుంది.?
వైసీపీకి, అద్భుతమైన ఛాన్స్ వచ్చింది.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో. ప్రత్యేక హోదాపైన కేంద్రాన్ని నిలదీసేందుకు వచ్చిన ఆ ఒక్క అవకాశాన్నీ వైసీపీ చేజార్చుకుంది. బీజేపీ అంటే ఎంత భయమోగానీ, బీజేపీ అడకుండానే, బీజేపీ ప్రతిపాదిత రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించేసింది. ఇదీ, వైసీపీ తెగువ. ‘మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు.. సోనియాగాంధీని ఎదిరించిన మొనగాడు..’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు ఏవేవో చెబుతుంటారు.
ఏదీ, ప్రధాని నరేంద్ర మోడీని సవాల్ చేయమనండి చూద్దాం.. అంటూ నెటిజనం, వైసీపీని ఏకిపారేస్తున్నారు. కేంద్రం మెడలు వంచడం సంగతి దేవుడెరుగు.. కనీసం కేంద్రాన్ని మొహమాటానికైనా రాష్ట్ర సమస్యల విషయమై ప్రశ్నించేంత సీన్ వైసీపీకి వున్నట్టు కనిపించడంలేదు.
వైసీపీనే స్వయంగా కేంద్రం యెదుట మెడలు వంచేసింది. ‘చచ్చినట్టు, వాళ్ళే మద్దతిస్తార్లే..’ అనే ధీమా బీజేపీకి, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏపీ నుంచి కలిగిందంటే, వైసీపీని ఎంతలా కమలనాథులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు.!
I have read so many posts regarding the blogger lovers but this paragraph is really a nice paragraph, keep it up.|
I couldn’t refrain from commenting. Perfectly written!|
I’m truly enjoying the design and layout of your site. It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more often. Did you hire out a designer to create your theme? Excellent work!|
Do you have any video of that? I’d want to find out some additional information.|
Simply wish to say your article is as astounding. The clearness in your post is just spectacular and i can assume you are an expert on this subject. Well with your permission let me to grab your feed to keep up to date with forthcoming post. Thanks a million and please keep up the enjoyable work.|
Remarkable things here. I am very happy to peer your post. Thank you so much and I’m looking ahead to contact you. Will you kindly drop me a e-mail?|
584813 160652I adore foregathering helpful details , this post has got me even a lot more info! . 735401