కెజిఎఫ్ చాప్టర్ 1తో అందరి దృష్టిని ఆకర్షించారు యష్, ప్రశాంత్ నీల్. ఎన్నో అంచనాల మధ్య కేజిఎఫ్ చాప్టర్ 2 ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
చాప్టర్ 1 ఎక్కడ ముగుస్తుందో సరిగ్గా అక్కడ నుండి చాప్టర్ 2 మొదలవుతుంది. నారాచిని తన వసం చేసుకున్న రాకీ భాయ్ కు ఇంకా పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. కిరాతకుడు అధీరాతో తలపడాల్సి వస్తుంది. దాంతో పాటు భారత ప్రధాన మంత్రి రమిక సేన్ ఎత్తుగడలను కూడా చవిచూడాల్సి వస్తుంది. మరి తనకంటే ఎన్నో రెట్ల పెద్ద శక్తులతో రాకీ భాయ్ ఎలా తలపడ్డాడు? కేజిఎఫ్ కథ ఎలాంటి టర్న్ తీసుకుంది? అన్నది మిగతా కథ.
నటీనటులు:
రాకీ భాయ్ ను పూర్తిగా ఓన్ చేసేసుకున్న యష్, చాప్టర్ 2 లో దాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. రాకీ భాయ్ గా రఫ్ఫాడించాడు. యష్ స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉంది. ఇక తన ఆటిట్యూడ్, స్టైలింగ్ గురించి చెప్పేదేముంది. దుమ్ములేపాడు.
రవీనా టాండన్ కు ఈ చిత్రంలో మంచి స్కోప్ కుదిరింది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. అధీరా పాత్రకు సంజయ్ దత్ లుక్ బాగుంది. వైకింగ్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అయితే రాకీ భాయ్ కు తగ్గ విలన్ గా అధీరా అనిపించడు. సంజయ్ దత్ వయసు కూడా ఇక్కడ ప్రభావం చూపించింది అని చెప్పవచ్చు.
ఫస్ట్ పార్ట్ లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించిన శ్రీనిధి శెట్టికి ఈసారి కొంచెం బెటర్ స్కోప్ దక్కింది. ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక వర్గం:
రవి బాసృర్ సంగీతం చాప్టర్ 1 కు ఎంత పెద్ద ప్లస్ అయిందో మనం చూసాం. చాప్టర్ 2 విషయంలో కూడా రవి బాసృర్ ఎక్కడా తగ్గలేదు. సాంగ్స్ సినిమాలో కలిసిపోయి ఇంప్రెస్ చేస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ సూపర్ గా సెట్ అయింది. ప్రతీ ఫ్రేమింగ్ కూడా అద్భుతంగా కుదిరింది. సినిమా అంతటా ఉండే డార్క్ షేడ్స్ డిఫెరెంట్ ఫీల్ ను కలిగిస్తాయి.
ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఉత్తమ నిర్మాణ విలువలతో నిర్మించారు హోంబేలె ఫిల్మ్స్. ప్రశాంత్ నీల్ కథ విషయంలో కొంత రాజి పడినట్లు అనిపిస్తుంది. లాజిక్స్ గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. హీరో క్యారెక్టర్ ను మెయిన్ బేస్ గా చేసుకుని సెంటిమెంట్స్ ను కేరాఫ్ అడ్రెస్ గా మార్చుకుని ఎలివేషన్స్ తో కుమ్మేసాడు.
పాజిటివ్ పాయింట్స్:
- యష్
- హీరోయిజం ఎలివేషన్ ఎపిసోడ్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- నిర్మాణ విలువలు
నెగటివ్ పాయింట్స్;
- బలమైన విలన్ లేకపోవడం
- లాజిక్ లేని సీన్స్
- సెకండ్ హాఫ్ లో ఉండే డల్ మూమెంట్స్
- స్క్రీన్ ప్లే
చివరిగా:
ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. కథ పెద్దగా లేకపోయినా ఎప్పటికప్పుడు వచ్చే హీరో ఎలివేషన్ షాట్స్, రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పైసా వసూల్ ఫీల్ వస్తుంది. ఇక పోస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ తో మతిపోవడం ఖాయం. కానీ ఆ తర్వాత నుండే సినిమా ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. కానీ ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే సరికి మళ్ళీ ప్రశాంత్ నీల్ డ్యూటీ ఎక్కేసాడు. మొత్తంగా చూసుకుంటే కేజిఎఫ్ చాప్టర్ 1 తరహాలోనే చాప్టర్ 2 కూడా మాస్ ప్రేక్షకులకు విందు, మరింత ఘనంగా. పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ కావొద్దు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5
858838 488651Definitely composed content material material , Genuinely enjoyed examining . 968713
309649 569272Yay google is my world beater assisted me to locate this wonderful internet site! . 313213
504987 825700Someone essentially lend a hand to make critically articles Id state. That could be the very first time I frequented your internet site page and so far? I amazed with the research you made to create this actual post extraordinary. Wonderful activity! 27060
316101 474251I will tell your friends to check out this website. .Thanks for the post. 559999
806166 489232You made some decent points there. I looked on the net for any issue and located most individuals goes in addition to with all your internet site. 399965