Switch to English

రాశి ఫలాలు: శనివారం 19 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:30
సూర్యాస్తమయం : సా‌.6:00
తిథి: మాఘ బహుళ తదియ రా.10:22 వరకు తదుపరి చవితి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : ఉత్తర సా.5:27 వరకు తదుపరి హస్త
యోగం: ధృతి రా.5:42 వరకు శూల
కరణం: వనిజ ఉ.10:37 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: రా.1:44 నుండి 3:19 వరకు
దుర్ముహూర్తం.:ఉ.6:00 నుండి 8:05 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం:మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం :ఉ.6:44 నుండి 8:10 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:08 నుండి ఉ.5:56 వరకు
అమృతఘడియలు: ఉ.10:11 నుండి మ.11:48 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి 12:53 వరకు

ఈరోజు (19-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన గృహాపకరణాలు కొనుగోలుచేస్తారు.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం: ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగామిస్తారు. ఇంటా బయట పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం: కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

సింహం: బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాలలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

కన్య: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.భూ సంభందిత క్రయ విక్రయాల అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అదిగమించి లాభాలు అందుకుంటారు. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చికం: సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మకరం: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలు సమస్యత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంట బయట పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల అంతగా కలసిరావు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...