Switch to English

పోలవరం ప్రాజెక్టులో ‘పులస’ చేపలు: నవ్విపోదురుగాక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

మీకు తెలుసా.? పోలవరం ప్రాజెక్టులో పులస చేపల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. ఆ ప్రత్యేక మార్గంలో పులస చేపలు, పోలవరం ప్రాజెక్టు ఎగువకు తేలిగ్గా వెళ్లగలుగుతాయట. ఇది సాంకేతిక అద్భుతం.. అంటూ ప్రచారం జరుగుతోంది.

అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.? ఆ ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రానికి ఎప్పుడు అందుతాయి.? అన్నదానిపై స్పష్టత లేదుగానీ, ‘పులస’ కథలు మాత్రం తెరపైకొచ్చాయి. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన వుంది పరిస్థితి.

సరే, పులస చేపల వ్యవహారం గురించి కాస్సేపు మాట్లాడుకుందాం. సముద్రం నుంచి గోదావరి నదిలోకి పులసలు ఈదుకుంటూ వస్తాయి. సముద్రంలో వున్నప్పుడు వీటిని ‘ఇలస’ అని మత్యకారులు పిలుస్తారు. గోదావరి నదిలోకి వచ్చాక, ‘ఇలస’ కాస్తా, పులసగా మారుతుంది.. దాని రుచి కూడా మారిపోతుంది.

ఇంతకీ, ఇప్పుడు పులస పరిస్థితేంటి.? గత కొంత కాలంగా పులస చేపల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. గోదావరి నది వద్దకు వచ్చే లోపు సముద్రంలోనే ‘ఇలస’ చేపల వేట ఎక్కువైపోయింది. ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనే చాలావరకు ‘ఇలసల’ వేట జరిగిపోతోంది. ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి ఇవి వలస వస్తుంటాయని చెబుతుంటారు.

ఇక, గోదావరిలోకి ప్రవేశించాక.. కాటన్ బ్యారేజీకి ఎగువన పులసలు లభ్యమవడం గగనం. అలాంటిది, అంతకన్నా చాలా దూరంలో పైనెక్కడో వున్న పోలవరం ప్రాజెక్టు వద్దకు పులసలు ఎలా వెళతాయబ్బా.? అదే మరి, మ్యాజిక్కు.

సరే, అవన్నీ జరుగుతాయనుకుందాం. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు.? చంద్రబాబు హయాంలోనే దాదాపు డెబ్భయ్ శాతం ప్రాజెక్టు పూర్తయిపోయిందన్నారు. మరి, గడచిన రెండున్నరేళ్ళలో మిగిలిన 30 శాతం ప్రాజెక్టు ఎందుకు పూర్తవలేదు.? ప్రాజెక్టు వ్యధ పక్కన పెట్టి, పులస ప్రచారం చేసుకుంటున్నామంటే.. ఏ స్థాయికి వ్యవస్థలు దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

2 COMMENTS

  1. ఇంతేనా లేక పోలవరం ప్రాజెక్టు పులస ఛేపలని, ర్రొయ్యలని రాయలసీమ జ్జిల్లాలకు పంపించే …న్న ఛేపలు, ర్రొయ్యల పధకాలు కూడా ఉన్నాయా? ఈ పైత్యానికి కారణం ఖచ్చితంగా ప్రత్యేక సలహాదారుల మేధస్సు ఫలితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...