Switch to English

పెంచారా.? తగ్గించారా.? ఆ సొమ్ములు ఏమైపోతున్నాయ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఉద్యోగులేమో జీతాలు పెరగలేదు, తగ్గుతున్నాయ్.. అని చెబుతున్నారు. అంతేనా, కొంతమంది ఉద్యోగులు లక్షన్నర వరకూ ప్రభుత్వానికే తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కొత్త పీఆర్సీతో వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం, దాదాపు 20 వేల కోట్ల భారం కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడుతుందని చెబుతోంది. ఇంతకీ, ఏది నిజం.?

కొత్త పీఆర్సీ వద్దు.. అని ఉద్యోగులు చెబుతున్న దరిమిలా, 20 వేల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించుకునేందుకు, పాత పద్ధితికే ప్రభుత్వం ‘జై’ కొట్టాలి కదా.? కానీ, ప్రభుత్వం అలా చేయడంలేదు. అంటే, కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వానికే లాభమన్నమాట. ఏమాత్రం కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు లాభం వున్నా, ఆ కొత్త పీఆర్సీని ఉద్యోగులు వదులుకునే ప్రసక్తి వుండదు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం విషయంలోనూ ఇలాంటి డొల్లతనమే కనిపిస్తోంది. ఇసుక పాలసీ, మద్యం పాలసీ.. ఇలా దేన్ని తీసుకున్నాసరే, పబ్లిసిటీ పీక్స్‌లో వుంటోంది.. మేటర్ మాత్రం పరమ వీక్ అవుతోంది.

న్యాయస్థానాల్లో పదే పదే ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నది ఇందుకే. సలహాదారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారా.? అధికారంలో వున్నోళ్ళు మొండిగా అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారా.? అన్నది పక్కన పెడితే, ప్రతి వ్యవహారమూ ఇలాగే బెడిసికొడుతోంది. మూడు రాజధానులు వ్యవహారం కూడా ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ప్రతిష్టకు పోయి పాలకులు మొండిగా వ్యవహరిస్తే, అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే. ఉద్యోగుల జీతాల విషయంలో ఇప్పుడు నడుస్తున్న గందరగోళం రాష్ట్ర ప్రగతికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. క్యాలెండర్ ప్రకారం మీట నొక్కి మరీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్, డొల్ల నిర్ణయాల విషయంలో క్రాస్ చెక్ చేసుకోకపోవడం శోచనీయం.

ఉద్యోగుల్ని ప్రభుత్వం చర్చలకు పిలిచింది. పీఆర్సీ వెనక్కి తీసుకుంటే తప్ప చర్చలకు వెళ్ళేది లేదని ఉద్యోగులంటున్నారు. ఎందుకీ పరిస్థితి.? బేషజాలు పక్కన పెట్టి, ఓ నెల రోజులపాటు కొత్త పీఆర్సీని వాయిదా వేసి ఉద్యోగులతో చర్చలు జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...