Switch to English

కార్గికేయ ’90ఎంఎల్’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి..
నిర్మాత: అశోక్ రెడ్డి
దర్శకత్వం: శేఖర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
ఎడిటర్‌: ఎస్.ఆర్ శేఖర్
ఆర్ట్: జీ.ఎం శేఖర్
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019

యంగ్ హీరో కార్తికేయకి `RX100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్రతో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన సినిమా `90 ML`. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కార్తికేయకి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఈ చిత్ర టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఆ కాన్ఫిడెన్స్ ని నిజం చేసే రేంజ్ లో సినిమా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

దేవదాస్ లాంటి కొడుకు పుట్టాలనుకున్న ప్రగతికి మన హీరో దేవదాస్ (కార్తికేయ) పుడతాడు. కానీ తను ‘ఫెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ డిజార్డర్’తో పుడతాడు. అనగా తను బతకాలంటే రోజు ఆల్కహాల్ తీసుకోవాలి. అలా రోజూ వయసుకు తగ్గ డొసేజ్ ఆల్కహాల్ తీసుకుంటూ పెరుగుతాడు. తన డ్రింకింగ్ అలవాటు వల్ల వేరే జాబ్ రాకపోవడం వల్ల వైన్ షాప్ మేనేజర్ గా జాయిన్ అవుతాడు. అదే టైంలో సువాసన(నేహా సోలంకి)తో ప్రేమలో పడతాడు. కానీ సువాసనది నాన్ ఆల్కహాల్ ఫ్యామిలీ. అందుకే దేవదాస్ కొన్ని రోజులు తను డ్రింకర్ కాదని మేనేజ్ చేస్తాడు. కానీ ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా దేవదాస్ డ్రింకర్ గా సువాసన అండ్ ఫ్యామిలీకి దొరికిపోతాడు. ఇక అక్కడి నుంచి తన ప్రేమని గెలిపించుకోవడానికి దేవదాస్ డ్రింకింగ్ మానేసాడా? లేక సువాసన అర్థం చేసుకుందా? అలాగే దేవదాస్ – సువాసన లైఫ్ లోకి జాన్ విక్(రవి కిషన్) ఎలా ఎంటర్ అయ్యాడు? వారిద్దరి ప్రేమకి ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? చివరికి దేవదాస్ ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

మొదటగా హీరో కార్తికేయ గురించి మాట్లాడుకుందాం.. కార్తికేయ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఈ సినిమాతో కామెడీ టైమింగ్ లో బెటర్ మెంట్ కనిపించింది. అలాగే డాన్సులు ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఎప్పటిలానే బాగా చేసాడు. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కార్తికేయకి కాస్త మైలేజ్ తెచ్చి పెట్టె సినిమా అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ నేహా సోలంకి తన పాత్రలో బాగానే చేసింది. రోల్ రిడా, సుదర్శన్, ప్రవీణ్, రఘు లాంటి కమెడియన్స్ అక్కడక్కడా నవ్వించారు. మెయిన్ గా విలన్ పాత్ర చేసిన రవి కిషన్ బాగా చేసాడు. ముఖ్యంగా తన పాత్రని ఒక కామిక్ విలన్ లా డిజైన్ చేశారు. ఆ కామిక్ సెన్స్ తన కాస్ట్యూమ్స్ విషయంలో వర్క్ అయ్యింది. రావు రమేష్, ప్రగతి, సత్య ప్రకాష్, ప్రభాకర్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సినిమా ప్రారంభం చాలా బాగుంటుంది. వెంటనే ఆడియన్స్ ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అలా మొదటి 30 నిమిషాలు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడక్కడా స్లో అనిపించినా మళ్ళీ ప్రీ ఇంటర్వల్ బ్లాక్ మరియు బ్రేక్ అప్ ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. లాగే సెకండాఫ్ మొదటి 10 నిముషాలు కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాకర్ – రఘు కామెడీ బాగా నవ్విస్తుంది. అలాగే కార్తికేయ మందు కోసం ట్రై చేసే పలు సీన్స్ బాగా నవ్విస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

కథా పరంగా చూసుకుంటే కార్తికేయ దేవదాస్ పాత్ర కోసం ‘ఫెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ డిజార్డర్’ పాయింట్ చాలా బాగుంది. దానివల్లే ఆడియన్స్ చాలా ఫాస్ట్ గా కెనెక్ట్ అవుతారు. ఇక ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా గ్రాండ్ గా ఉంది. చెప్పాలంటే కథకి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ‘వినిపించుకోరు’ సాంగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఫస్ట్ హాఫ్ లో మొదట 30 నిమిషాల తర్వాత మనం చాలా కమర్షియల్ సినిమాల్లోలానే హీరోయిన్ దగ్గర హీరో తన క్యారెక్టర్ ని మేనేజ్ చేసే సీన్స్ వస్తుంటాయి. అవి అంతగా ఆకట్టుకోలేదు, ఆ లవ్ ట్రాక్ లో కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండాఫ్ అయితే చాలా అంటే చాలా బోరింగ్ గా ఉంది. స్టోరీ లైన్ చాలా సింపుల్ అవ్వడం, అది ఇంటర్వెల్ దగ్గరే చెప్పేయడంతో ప్లే తో సెకండాఫ్ నడిపిద్దాం అనుకున్నారు, కానీ డైరెక్టర్ వేసుకున్న ప్లే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఫ్రెష్ ట్రీట్ మెంట్ రాసుకోకుండా కమర్షియల్ యాంగిల్ లో ఎన్నో సినిమాల్లో చెప్పేసిన సీన్స్ అండ్ ఫైట్స్ ని వేసుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా ఇంటర్వల్ బ్రేకప్ తర్వాత మళ్ళీ సెకండాఫ్ లో నాలుగైదు బ్రేకప్ మూమెంట్స్ చూస్తాం.. ప్రతి సారి ఓ సీన్, బ్రేకప్ అండ్ సాంగ్ ఇదే ఫార్మాట్ లో వెళ్తుంది తప్ప కథ పరంగా వాళ్ళ ఎమోషన్ ని చూపించేలా సీన్స్ సరిగా రాసుకోలేదు. 15 నిమిషాల తర్వాత చెప్పిన సీన్స్ నే మళ్ళీ రిపీటెడ్ గా లొకేషన్స్ మార్చి ఎందుకు చెబుతున్నాడ్రా బాబు అనే ఫీలింగ్ లోకి ఆడియన్స్ వెళ్ళిపోతారు. సరే అప్పటి దాకా భరించాం ఇక అన్నా ఫినిష్ చేస్తాడు అనుకునే టైంలో ఒక ఐటమ్ సాంగ్, ఇంకో యాక్షన్ బ్లాక్ పెట్టి మరీ రొటీన్ కమర్షియల్ మూసలో ఇంకా చిరాకు పెట్టించేసాడు. అలా సెకండాఫ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అలాగే లవ్ లో ఉన్న పెయిన్ ని బలంగా ఇద్దరిలోనూ ఎక్కడా చూపించలేదు. వాళ్ళ ప్రకారం చూపించారు అనుకుంటున్న సీన్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు..

ఆఫ్ స్క్రీన్:

కథే హీరో.. ఆ హీరో ని రెడీ చేయడం కోసం ఎంచుకున్న డిజార్డర్ పాయింట్ చాలా బాగుంది. ఈ విషయంలో మెచ్చుకోవాలి. కానీ దాన్ని పూర్తి కథగా ఫినిష్ చేసే టైంకి పాయింట్ అంత బాగా చేయలేదు. దానిని తెరపై ఇంకా బోరింగ్ గా చూపించారు. పాయింట్ ఎంత ఫ్రెష్ గా ఉందొ అంతే ఫ్రెష్ గా ట్రీట్మెంట్ రాసుకొని ఉంటే ఆటోమాటిక్ గా కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేసేవి. అలా కాకుండా ఒక ఫార్ములాయిక్ పాట, ఫైట్, కామెడీ బిట్ అన్న ఫార్మటులో కథ రాయడం వలన సెకండాఫ్ చాలా బాడ్ గా తయారయ్యింది. ఇకపోతే స్క్రీన్ ప్లే కూడా అదే బేసిక్ ఫార్మాట్.. మొదటి 15 నిమిషాల తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్స్ మరియు డైలాగ్స్ కూడా ఆడియన్ చెప్పేసేంత వీక్ గా, ఊహాజనితంగా రాసుకున్నారు. ఇక డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గ గొప్పగా ఏం లేవు. ఇక డైరెక్టర్ గా శేఖర్ రెడ్డి గురించి చెప్పాలంటే అనుకున్న పాయింట్ ని మొదటి 5 నిమిషాల్లోనే ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆ కెనెక్షన్ ని చివరి దాకా హోల్డ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో అయితే పూర్తిగా విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉన్నా సెకండాఫ్ సూపర్బ్ గా ఉండాలి మరియు పాయింట్ ఫ్రెష్ ఉంటే చాలదు స్టోరీ ట్రీట్ మెంట్ కూడా ఫ్రెష్ గా ఉండాలి అనే బేసిక్ లాజిక్స్ ని మిస్ అవ్వడం వల్ల ఒక 50% మాత్రమే సక్సెస్ అయ్యాడు. అలాగే రన్ టైం విషయంలో కూడా డైరెక్టర్ ది రాంగ్ జడ్జ్ మెంట్. సుమారు 20-30 నిమిషాల సినిమాని కట్ చేస్తే సినిమా స్పీడ్ గా ఉండి, ప్రేక్షకులకి ఇంకా బెటర్ ఫీలింగ్ వచ్చేది.

ఇక యువరాజ్ సినిమాటోగ్రఫీ ఎలా ఉంది అంటే 70% బాగుంటే, 30% బాలేదు. చాలా చోట్ల కెమరా షేక్స్, ఇమేజ్ బ్లర్ ఉంటుంది. అవి చూసే ఆడియన్స్ కి చాలా ఇబ్బంది కలిగించాయి. అలాగే ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ వర్క్ ఫస్ట్ హాఫ్ పరంగా ఓకే కానీ సెకండాఫ్ పరంగా మాత్రం చాలా వీక్. ఈయన అయినా డైరెక్టర్ తో పోరాడి మరీ రిపీటెడ్ సీన్స్ వస్తున్నాయి కట్ చేద్దాం అని ఒక 20 నిమిషాలన్నా ట్రిమ్ చేసి ఉండాల్సింది.

విశ్లేషణ:

2019లో ఇప్పటికే మూడు పరాజయాలు(హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్) చవి చూసిన యంగ్ హీరో కార్తికేయకి ఈ ’90ML’ సినిమా కూడా తనకి కావాల్సిన స్ట్రాంగ్ హిట్ ని ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. కానీ ఈ ఏడాది నిరాశపరిచిన సినిమాలకంటే ఇది బెటర్. స్టోరీ లైన్ బాగున్నా, పూర్తి కథగా తెరపై మెప్పించలేకపోయారు. యూనివర్సల్ కనెక్షన్ పాయింట్ అయిన ఆల్కహాల్ అలియాస్ లిక్కర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా కావడం వలన మరియు యూత్ అట్రాక్షన్ వలన ఓపెనింగ్స్ గత సినిమాలకంటే బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంటే చాలు సెకండాఫ్ ఎంత బోరింగ్ అండ్ రొటీన్ గా ఉన్నా కమర్షియల్ బొమ్మ కాబట్టి చూసేస్తాం అనుకునే వారు చూడచ్చు, మిగతా వారికి సెకండాఫ్ హెడేక్ గా అనిపిస్తుంది. పాయింట్ బాగుండి, తెరపై పూర్తిగా మెప్పించలేకపోయిన హాఫ్ బేక్డ్ సినిమాల్లో ’90ML’ ని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో ’90ML’ ఎలా ఉంది అంటే, ‘సూపర్బ్ స్టార్టింగ్ – వరస్ట్ ఎండింగ్’ అని చెప్పచ్చు.

ఫైనల్ పంచ్: 90ML – ఈ బ్రాండ్ లో పెద్ద కిక్ లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...
నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి.. నిర్మాత: అశోక్ రెడ్డి దర్శకత్వం: శేఖర్ రెడ్డి సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్ మ్యూజిక్: అనూప్ రూబెన్స్ ఎడిటర్‌: ఎస్.ఆర్ శేఖర్ ఆర్ట్: జీ.ఎం శేఖర్ విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019 యంగ్ హీరో కార్తికేయకి `RX100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్రతో నిర్మాత...కార్గికేయ '90ఎంఎల్' మూవీ రివ్యూ