Switch to English

సినిమా రివ్యూ: మిస్ మ్యాచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

నటీనటులు:  ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి..
నిర్మాత: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
దర్శకత్వం:  ఎన్.వి.నిర్మల్ కుమార్
సినిమాటోగ్రఫీ: గణేష్ చంద్ర
మ్యూజిక్: గిఫ్టన్ ఇలియాస్
కథ: భూపతి రాజా
మాటలు: రాజేంద్రకుమార్, మధు
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019

ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన చిత్రం `మిస్ మ్యాచ్‌`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్ టైం బ్లాక్ బస్టర్ అయినా ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘నీ మనసే సే’ సాంగ్ ని రీమేక్ చేసి, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేసిన ఈ సినిమాని ప్రమోషన్స్ తో ప్రేక్షకులకి చేరువ చేశారు. మరి ఈ మిస్ మ్యాచ్ ఆడియన్స్ కి ఎంత వరకూ మ్యాచ్ అయ్యిందో చూడండి..

కథ:

తన డ్రీమ్స్ తీర్చుకోలేకపోయిన ఫాదర్ గోవింద్(ప్రదీప్ రావత్) చిన్నప్పుడే తన కుమార్తె మహా లక్ష్మి (ఐశ్వర్య రాజేష్) టాలెంట్ చూసి తనని రెజ్లర్ గా తయారు చేసి, నేషనల్ చాంపియన్స్ జాబితాలో చేరుస్తాడు. మరోవైపు చిన్నప్పటి నుంచి మంచి టాలెంట్ ఉండి బాగా చదువుకున్న సిద్దు(ఉదయ్ శంకర్) మెమొరీ చాంపియన్ పోటీల్లో టాపర్ గా నిలుస్తాడు. అలా డిఫరెంట్ ఫీల్డ్స్ కి సంబదించిన వీరిద్దరూ ఒక సత్కార సభలో కలిసి సిద్దు – మహా ప్రేమలో పడతారు. వీరి ప్రేమని ఇద్దరి ఫ్యామిలీస్ కి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ సిద్దు ఫ్యామిలీ మహా రెజ్లింగ్ మానెయ్యాలని కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ కి మహా ఒప్పుకోదు. దాంతో ఇద్దరి మధ్యా, ఇరు ఫ్యామిలీస్ మధ్యా ఇబ్బందులు వస్తాయి. అలా మొదలైన ఇబ్బందులు ఎలా క్లియర్ అయ్యాయి? చివరికి సిద్దు – మహా మధ్య మనస్పర్థలు తొలగి, చివరికి ఇద్దరి ఫ్యామిలీస్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదా? అలాగే మహా ఒలంపిక్ చాంపియన్ గా నిలవాలన్న తన తండ్రి కోరికని నెరవేర్చిందా? లేదా? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవాలి. తనకి రాసిన ప్రతి సీన్ లోనూ తన నటనతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ అండ్ రెజ్లింగ్ సీన్స్ లో ది బెస్ట్ అనిపించుకుంది. చాలా రోజుల తర్వాత ప్రదీప్ రావత్ నటనకి మంచి అవకాశమున్న పాత్రలో కనిపించి, మంచి నటనని కనబరిచాడు. ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటీనటులు పరవాలేదనిపించారు.

ఇక కథలో ఆడియన్స్ కి బాగా నచ్చే సీన్స్ విషయానికి వస్తే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర డిజైనింగ్ కనెక్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సీన్స్ బాగుంటాయి. ప్రదీప్ రావత్ – ఐశ్వర్య రాజేష్ మధ్య జరిగే సీన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.

ఆఫ్ స్క్రీన్:  

గిఫ్టన్ ఇలియాస్ మ్యూజిక్ చాలా బాగుంది. సీన్స్ లో కంటెంట్ వీక్ అయినా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేయడానికి ట్రై చేసాడు. ఎడిటర్ చాలా వరకూ కట్ చేసి లెంగ్త్ తగ్గించడం వలన పరవాలేధనిపిస్తుంది.  రాజేంద్రకుమార్ – మధుల డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ హీరో ఉదయ్ శంకర్.. తన పాత్ర డిజైనింగ్ బాగున్నా, తన నటన చాలా వీక్ గా ఉండడంతో తేలిపోయాడు. తనూ బెటర్ పెర్ఫార్మన్స్ చేయలేదు, డైరెక్టర్ కూడా రాబట్టుకోలేకపోయాడు. తెలిసిన నటీనటులు కాకూండా మిగిలిన నటీనటుల నటన కూడా చాలా బాడ్ గా ఉంది. అలాగే లవ్ స్టోరీ అంటే హీరో – హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుండాలి, కానీ ఇక్కడది వరస్ట్. అలాగే ఇద్దరి మధ్యా ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్ గా ఉన్నాయి, పోనీ రొటీన్ అయినా అవి వర్కౌట్ అయ్యాయా అంటే అదీ లేదు.

ఇకపోతే ఈ సినిమాకి కీలకం అయినా రెజ్లింగ్ ఎపిసోడ్స్ ని సరిగా తీయలేదు. చాలా వరకూ ఈ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి హై ఫీలింగ్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. మెయిన్ గా క్లైమాక్స్ రెజ్లింగ్ ఎపిసోడ్ అస్సలు కిక్ ఇవ్వలేదు. సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ ఏదోలా చూసేసిన సెకండాఫ్ మాత్రం భారీ డిజాష్టర్ అని చెప్పాలి.

ఆఫ్ స్క్రీన్:  

భూపతి రాజా రాసిన కథ చాలా ఓల్డ్ ఫార్మాట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దంగల్’ కథని తీసుకొని, దానికి లవ్ స్టోరీని మిక్స్ చేసి రొటీన్ రొట్టలా తయారు చేసిన కథే ఇది. సరే ఇందులో ఎమోషన్ అన్నా కొత్తదా అంటే అదీ లేదు. ఎందుకంటే గోపీచంద్ ‘మొగుడు’ సినిమాలోని ఎమోషనల్ పాయింట్ ని ఈ కథలో మిక్స్ చేశారు. సో వెరీ బోరింగ్ కథ. ఇక కథనం అన్నా నిర్మల్ కుమార్ స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది కానీ అదీ జరగలేదు. అంతా ఊహాజనితంగా సాగుతూ చాలా బోరింగ్ గా ఉంటుంది. కామెడీకి స్కోప్ ఉన్నా పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు, అలాగే ఉన్న కామెడీ పేలలేదు. ఇక డైరెక్టర్ గా అయితే ఫాదర్ – డాటర్ ట్రాక్ మరియు ఎమోషన్స్ విషయంలో సక్సెస్ అయినా ఓవరాల్ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.

ఇక గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. ఫ్రేమింగ్, కలరింగ్, విజువల్ గా క్లారిటీ లేకపోవడం లాంటి చాలా బ్లండర్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. అలాగే గ్రీన్ మాట్ లో తీసిన చాలా చీట్ షాట్స్ లో సిజి ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా వరస్ట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చాలా బాడ్ అనే చెప్పాలి. ఇక టెక్నికల్ గా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ‘ఈ మనసే సే సే’ సాంగ్ ని రీమిక్స్ చేసిన విధానమే చాలా బాడ్ అంటే, విజువల్ గా ఇంకా వరస్ట్ గా తీశారు. ఈ విషయంలో మాత్రం టీం కనపడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టినా కొడతారు అంత బాడ్ గా పిక్చరైజ్ చేశారు.

విశ్లేషణ:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ రీమిక్స్ సాంగ్, విక్టరీ వెంకటేష్ లాంటి వారిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచి, ఐశ్వర్య రాజేష్ లాంటి స్టార్ పెర్ఫార్మర్ ని ముందు పెట్టుకొని, ఎంతో కొంత బజ్ క్రియేట్ చేసి రిలీజ్ చేసిన ‘మిస్ మ్యాచ్’ సినిమా ఎలా ఉంది అంటే ఓ మోస్తరు సినిమా అన్నా చూసి రిలాక్స్ అవుదాం అనుకొని థియేటర్ కి వచ్చే ప్రేక్షకులని కూడా పూర్తిగా నిరాశ పరిచేలా ఉంది. రీమిక్స్ చూసి అయితే పవన్ ఫ్యాన్స్ తిట్టుకుంటారు. కేవలం ఐశ్వర్య రాజేష్ కి మేము డై హార్డ్ ఫాన్స్ అనుకునే వాళ్ళు మాత్రం తన కోసం ఈ సినిమాకి వెళ్ళచ్చు. అది కూడా తను ఉన్న సీన్స్ చూసి మిగతా సీన్స్ అప్పుడు పేస్ బుక్ లో టైం పాస్ చేస్తే తప్ప ఈ 135 నిమిషాలు సినిమాని భరించడం కష్టం సుమీ.

ఫైనల్ పంచ్: మిస్ మ్యాచ్ – మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడికి ఇదో ‘మిస్ మ్యాచ్’
 
తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1/5  

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...
నటీనటులు:  ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి.. నిర్మాత: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ దర్శకత్వం:  ఎన్.వి.నిర్మల్ కుమార్ సినిమాటోగ్రఫీ: గణేష్ చంద్ర మ్యూజిక్: గిఫ్టన్ ఇలియాస్ కథ: భూపతి రాజా మాటలు: రాజేంద్రకుమార్, మధు విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019 ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన చిత్రం `మిస్ మ్యాచ్‌`. పవర్ స్టార్...సినిమా రివ్యూ: మిస్ మ్యాచ్