అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఆ సందర్భంగా బాలకృష్ణ మరియు అల్లు శిరీష్ మధ్య సరదా సంభాషణ జరిగింది. అప్పుడే అల్లు శిరీష్ మాట్లాడుతూ.. మీరు నటించినా సింహ పేరు ఉన్న సినిమాల్లో జయసింహ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, వీర సింహా రెడ్డి, బొబ్బిలి సింహం ఇవి కాకుండా ఇంకో సింహాం ఉన్న సినిమా ఉంది చెప్పండి అంటూ బాలకృష్ణను అడిగాడు.
ఆ సమయంలో బాలకృష్ణ చెప్పలేక పోవడంతో ‘సింహం నవ్వింది’ అనే సినిమా ను మీరు చేశారంటూ అల్లు శిరీష్ అన్నాడు. అది అట్టర్ ఫ్లాప్ మూవీ, సింహం నవ్వడం ఏంటయ్యా బాబు అందుకే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని బాలకృష్ణ తన సినిమా తానే పంచ్ వేసుకున్నాడు. వీరసింహా రెడ్డి రాబోతున్న సమయంలో ఫ్లాప్ సింహా సెంటిమెంట్ ను అల్లు శిరీష్ గుర్తు చేశాడనే కామెంట్స్ వస్తున్నాయి.