Switch to English

టీడీపీకి ఊపిరిలూదుతున్న వైఎస్సార్సీపీ

‘మేమే అధికారంలో వుండాలి.. ఒక వేళ అధికారం చేజారితే.. వాళ్ళకి మాత్రమే అది దక్కాలి..’ అన్న అభిప్రాయం ఇటు వైఎస్సార్సీపీ, అటు తెలుగుదేశం పార్టీలో వున్నట్లు కన్పిస్తోంది. మరో రాజకీయ పార్టీకి రాష్ట్రంలో అధికారం దక్కకూడదన్నది ఈ రెండు రాజకీయ పార్టీల నిశ్చితాభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో దారుణంగా దెబ్బతినేసిన మాట వాస్తవం. ఆ పార్టీకి ఊపిరిలూదేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రకరకాల మార్గాలు అన్వేషిస్తోంది.

లేకపోతే, చంద్రబాబు ఉత్తరాంధ్రలో నిర్వహించనున్న ప్రజా చైతన్య యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించడమేంటి.? విశాఖలో ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. మూడు రాజధానుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా వైసీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఆ ‘యాగీ’కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది నెక్స్‌ట్‌ లెవల్‌ అనే స్థాయిలో వుంది.

సహజంగానే టీడీపీ శ్రేణులు, వైసీపీ వ్యూహాల్ని తిప్పి కొట్టేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా టీడీపీ అధినేతపై సింపతీ ఆటోమేటిక్‌గా క్రియేట్‌ అవుతుంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన క్యాడర్‌ వుందన్న విషయం వైసీపీకి బాగా తెలుసు. విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని ప్రకటించినా, ఆ మూడు జిల్లాల్లో ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలమైన వాతావరణమైతే కన్పించడంలేదు.

విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. ఒకవేళ విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే.. అక్కడ కొత్తగా కష్టాలు వచ్చిపడతాయేమోగానీ, కొత్త అభివృద్ధి ఏమీ వుండదన్నది మేధావుల అభిప్రాయం. కేంద్రం ఇప్పటికే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ని ప్రకటించినా, వాల్టేర్‌ డివిజిన్‌ని ముక్కలు చేసింది. ఈ విషయమై కేంద్రాన్ని ప్రశ్నించలేని వైసీపీ, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌.. అంటూ కొత్త డ్రామాకి తెరలేపింది.

విభజన చట్టం ప్రకారం విశాఖకు చాలా చేయాల్సి వుంది కేంద్రం. ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితి వైసీపీది. మరోపక్క, గత ఐదేళ్ళ పాలనలో విశాఖను చంద్రబాబు ఉద్ధరించింది లేదాయె. ఎలా చూసినా వైసీపీ – టీడీపీ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ కన్పిస్తోంది తప్ప.. రెండు పార్టీలకీ విశాఖపై చిత్తశుద్ధి లేదన్నది నిర్వివాదాంశం. ఎలాగైతేనేం, వైసీపీ ఆందోళనలతో టీడీపీ మైలేజ్‌ పెరిగిందని తెలుగు తమ్ముళ్ళు లోలోపల ఖుషీ అవుతుండడం గమనార్హం ఇక్కడ.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

వర్మ మరో సంచలనం : ఏటీటీ కోసం ‘పవర్‌స్టార్‌’ చిత్రం

రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో డిజిటల్‌ చిత్రాలపై దృష్టి పెట్టాడు. ఓటీటీ కాకుండా ఏటీటీ(ఎనీ టైమ్‌ థియేటర్‌) అంటూ సినిమా వెనుక సినిమాను విడుదల చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే తన...

బిగ్‌ స్టోరీ: ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరు వెనుక రాజకీయం.!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే ఏంటి.? అని గ్రామ స్థాయిలో ఎవర్నన్నా ప్రశ్నిస్తే, ‘రాజశేఖర్‌రెడ్డి పార్టీ’, ‘జగన్‌ పార్టీ’ అని అంటుంటారు. కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసలు పేరు వేరు. ఇది...

రఘురాముడిపై వైసీపీ వ్యూహం ఏంటి?

వైఎస్సార్ సీపీలో ధిక్కార స్వరం వినిపిస్తూ.. సీఎం జగన్ పై మాత్రం అభిమానం కనబరుస్తూ.. సమయం ఇస్తే అన్నీ వివరిస్తానని అభ్యర్థిస్తూ.. బీజేపీపై సాప్ట్ కార్నర్ కనబరుస్తూ.. ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపిస్తూ.....

ఆసుపత్రి నుంచి అచ్చెన్న డిశ్చార్స్‌.. వీల్‌ ఛెయిర్‌లో ఎందుకు.?

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుని కొద్ది సేపటి క్రితం గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు. ఈఎస్‌ఐ మెడికల్‌ స్కావ్‌ులో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. కొద్ది...

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి విరాటపర్వం

అంతా సవ్యంగా నడిచి ఉంటే ఈపాటికి విరాటపర్వం రిలీజై చాలా రోజులై ఉండేది. అయితే లాక్ డౌన్ కారణంగా 90 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ అక్కడే నిలిచిపోయింది. ప్రభుత్వం...